పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదవ ప్రకరణము.

49


తత్వాయ ముక్తి ప్రదాయ, నమో అహ్మణే వ్యాపినే శాశ్వతాయ.” 'ఆయన ఈజగత్తునకు కారణుడు, ఆయన -ఈజగత్తునకు ఆశ్రయుడు, ఆతను మనకు ముక్తి దాత, ఆతడు బ్రహ్మ, సర్వదేశ వ్యాపి, కాలము నకు అతీతుడు, నిత్యుడు” అనియుండెను. ఈతంత్రీక్తస్తోత్ర సంశోధ నయందును, దాని వంగ భాషానువాదము నందును, తత్వవాగీశునివద్ద నుండి విశేష సహాయమును పొందితిని. అందుకొర కాతనికి మిక్కిలి కృతజ్ఞుడును.


పిమ్మట నేనొక ప్రార్థన రచించి ఉపాసనా ప్రణాళి చివరను చేర్చితిని, " హే పరమాత్మన్ ! మోహాకృత పాపములనుండి విముక్తులను గావించి, చెడుకోర్కెలను తోపనీయక, మమ్ములను నీనియమిత ధర్మపాలనము నందు యత్నశీలురనుగా జేయుము. శ్రద్ధాప్రీతి పూర్వకముగా అహరహము, నీయ పార మహిమను, పరమమంగళ స్వరూపమును చింతించుటకు ఉత్సాహయుక్తులను గామిపుము. తన్మూలమున, క్రమముగా నిత్య సహవాసజనిత మహానందము నొంది కృతార్థులము కాగలుగుదము గాక ! "


1845 సంవత్సరములో బాహ్మసనూజమునందీ యుపాసనావిధానము ప్రవర్తిత మయ్యెను. కాని అప్పుడు స్తోత్ర పాఠము చేయుసమయమున బంగాళీ భాషాంతరీకరణమును చదుపుట యలవాటులేదు. 1848 సం|| రమునుండి మాత్రమది ప్రారంభించిరి. ఈయుపాసనా ప్రణాళి బాహ్మసమాజము నందు ప్రవర్తితమగుటకు పూర్వమచట కేవలము - వేదపఠనము, వ్యాఖ్యానములతో గూడిన ఉపనిషత్ శ్లోక పఠనము,రామచంద్ర విద్యా వాగీశుని ఉపన్యాసములు, బాహ్మకీర్తనలు పాడుట మాత్రమే జరుగుచుండెను.

7