పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,

ఎనిమిదవ ప్రకరణము


మొట్ట మొదట ' తత్వబోధినీ ' పత్రికా ముద్రాలయము "హెడ్వా " (Media) యందొక యింటిలో నుంచితిమి. ఈ “ హెడ్వా'యే నేను చదువుచుండిన రామమోహనరాయల వారీ స్కూలుండిన స్థలము. ఉపనిషత్తులును వేదాంత భాష్యమును నాతోకలసి చదువుటకు రామచంద్ర విద్యా వాగీశుడు ఇచ్చటికి వచ్చుచుండెను. ఒక సారి మాతండ్రి గారన్న మాటలకు జడిసి మాయింటి వద్ద ఈ పనిచేయుటకు సాహసింప లేదు." విద్యా వాగీశుని యెడల చిరాకు పుట్టి ఒకసారి మాతండ్రి గారు, " విద్యా వాగీశుడు బుద్ధి మంతుడను కొంటిని,గాని తన బ్రహ్మమంత్రముల నుపదేశించి మా దేవేంద్రుని పాడు చేయు చున్నాడు. మావానికి అసలే ప్రపంచజ్ఞానము స్వల్పము. ఇప్పుడు దానియందు బొత్తుగా శ్రద్ధ లేదు. దినమంతయు, ' బ్రహ్మ, బ్రహ్మా ' తప్ప మరేమియు లేదు. ”

ఈ విధముగ మాతండ్రి గారికి విసుగు పుట్టుటకు కారణము లేకపోలేదు. అది ఎట్లన. లార్డు ఆక్ లండు (Lord Auakland) గవర్నరుజనరల్ గానుండి నపుడు, ఒక సారి మా బెల్గేరియా (Belgachia) ఉద్యానవనములో ఆయన చెల్లెలగు మిస్ ఈ డెన్ (Miss Eden) గారికి మరికొందరు గొప్ప గొప్ప దొరలకు దొరసానులకు మాతండ్రి గారు ఒక గొప్ప విందు నొసంగిరి. సౌందర్యములు, నృత్యములు, మద్యపాన ములు దేదీప్యమానమౌ దీపకాంతులు, అన్నియును కలసి ఉద్యాన వనమును ఒక్క మారుగా ఇందభవనముగా మార్చివేసెను. విఖ్యాతు లగు కొందరు బంగాళీలు ఈ విందును చూచిన పిమ్మట మాతండ్రి గారీని గురించి, ఈయనకు కౌనలసిన దెంత సేపూ ఆంగ్లేయులే, బంగా ళీల నెప్పుడు ఆహ్వానింపడు” అనిరి. ఇదిమాతండ్రిగారి చెవినిబడెను,