పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము.

37


కావున కొంత కాలమైన పిమ్మట బంగాళీ ప్రముఖులను కొందరను పిలచి, గానములతోను నృత్యముల తోను ఆయుద్యానవనముననే ఇంకొక వేదిక కావించిరి. నాడు ముఖ్యముగా నేను వారినందరిని యాదరింప వలసి యుండెను. కాని విధివశమున నాడే " తత్వబోధినీ” సభాస మావేశము కూడ కావలసి యుండెను. నాడా సభా విషయమున మునిగి యుంటిని. మేమాదినము ఈశ్వరోపాసన చేయవలసి యుండెను. కావున ఈ ముఖ్య కర్తవ్యమును వదలి యాసభకు వెళ్ళజాలక పోతిని. మాతండ్రిగారి కాగ్రహమువచ్చు నేమోయని ఒక్కమారు మాత్రము ముఖము కనబరచి మరలి పోతిని దీనిని. బట్టి నాకు ప్రపంచము యెడల గల యుదాసీన భావము ఆయనకు స్పష్టపడెను.


అప్పటి నుండియు వేదాంతము చదివియు, బ్రహమ్,బ్రహ ' యనియు చెడిపోకుండ చూచుటకు మాతండ్రిగారు చాలజాగ్రత పడుచుండిరి. ఆయన అభిలాష ఏనునిన, తమదృష్టాంతముననుకరించి నేనును గౌరవమును, మర్యాదను, ప్రాముఖ్యతను బడసి అందరిలో నను యశోవంతుడను కావలెనని. కాని నామన సట్టివాని కన్నిటికి విపరీతముగా నుండుటచూచి ఆయన ఎల్లప్పుడును దుఃఖించుచు బెంగగొని యుండెను. అయినను నామ నోభావముల నింకను ఆయన పూర్తిగా తెలిసికొన లేకుండెను. ఒక వంక నాకు సాంఘిక మర్యాదలు కావలెనని ఆయన కోరుచుండగా, ఇంకొకవంక " ఈశ్వరా!నీవు లేనిదే 'నాకీ జీవనముండి ఏమిప్రయోజనము ” అని నేనెంతోపరితపించు చుంటినని ఆయన కేమి తెలియును. ఉపనిషత్తులలో " నావి త్తేనతర్పణ్యమనుష్య " అను మాటలను చదివి ధనమునందు సంపూర్ణ విముఖత్వము నందితినని ఆయన ఇంకను ఎరుగడు. అట్టి నన్ను ఇంక తిరిగి విషయ సౌఖ్యములలో ఆయన ఎట్లు ముంపగలుగును ? ఆయనే కాదు, ఇంకెవ్వరును ముంపజాలరు. ఇంకేయాశయు నన్ను