పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము.

35


తుట్టతుద కెట్లో అటువంటి వాని సహాయము తోనే 'తత్వబోధినీ' పత్రిక యందు , నాయాశయముల నెర వేర్చగలిగితిని. అతని రచనా సౌష్టవముఆ కాలమున బహుకొలది మందికి మాత్రమేయుండెను. అప్పుడు వార్తాపత్రికలు గూడ బహుకొలదిగా నుండెను. అవీయైనను లోకహిత కారులుగను, జ్ఞానాభివృద్ధి దాయకములుగను ఉండు వ్యాసములను ప్రచుగింపు చుండెడివి కావు. వంగ దేశమునందు ప్రపథమమున “తత్వబోధినీ పత్రికయే ఈలోపమును తొలగించెను. "వేద వేదాంతములును, పరబ్రహ్మోపాసనయు వ్యాపింప జేయుట నాముఖ్య సంకల్పము. ఈపత్రిక ద్వారా నాసంకల్పమును నెరవేర్చికొంటిని.బ్రహ్మ ప్రతిపాదక ఉపనిషత్తులనే మేము వేదాంతముగా భావించుచుంటిమి.వేదాంతదర్శనమందు శంకరాచార్యులు బ్రహ్మన జీవిని ఏకము చేసెను. గనుక దానియందు మాకంత శ్రద్ధ లేకుండెను. యీశ్వరోపాసన, ఉపాసకుడును ఉపాస్యమునుఒక్కటే యైనచో ఇంక ఉపాసన ఎవరు చేయుట ? ఎవరికి చేయుట ?వేదాంతదర్శనమందలి మతమునకు 'మేము సమ్మతింప లేదు. మేము విగ్రహారాధన కెట్లు విరోధులమో అద్వైతమునకును అట్లే విరోధులము. ఉపనిషత్సూతముల కన్నిటికిని శంకరాచార్యులు అద్వైతపరముగా నర్ధము చెప్పసాగెను. గావున శంకరుల వ్యాఖ్యానముతో మేము పూర్తిగా ఏకీభవింప లేదు. ఇందువల్ల శంకరభాష్యములకుమారుగా నేను పనిషత్తులకు కొత్త వ్యాఖ్యానములను వ్రాయ వలసి వచ్చెను. ఆస్తిక సిద్ధాంతమును నిర్ధారణ చేయు సంస్కృత వ్యాఖ్యాన మొకటి వ్రాసితిని. దానిని బంగాళీలోనికి భాషాంతరీకరించి ' తత్వబోధిని'లో భాగములుగా ప్రకటింప నారంభించితిని. మాకు కావలసినది