పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము,

33



ప్రాణతుల్యమైన విషయమును నేను పొందితిని. ఈ్వరుడు మనకు ప్రాణములనే గాక ఆత్మలనుకూడ దయచేసియున్నాడు. అతడు కేవలము మస ప్రాణములకు ప్రాణ మేగాక ఆత్మలకు ఆత్మకూడ నైయున్నాడు. ఈశ్వరుని, ఆత్మనుండియే మన యొక్క ఆత్మలు జనించినవి. అతడు, అద్వి తీయుడు, నిత్యుడు, వికారము చెందనివాడు, అనంతడు, అతడు కేవలము జ్ఞాన స్వరూపుడు. పరమాత్మ నాశ రహితు డైయుండి తన స్వరూపమునుండి అసంఖ్యాకములైన పరిమితాత్మలను సృజించుచున్నాడు.ఈవిషయమే ఉపనిషత్తులలో నీక్రింది విధముగా చెప్పబడియున్నది “ఏకం రూపం.ధాయిః కరోతి”. “ఏక స్వరూపమునుండి అనేకస్వరూపముల నెవడు చేయుచున్నాడో" అతని నుపాసించినచో, ప్రతిఫలముగా నతనినే పొందుచున్నాము. అతడు ఉపాసింపబడు వాడు, నేనతని యుపాసకుడను. అతడు నాకు ప్రభువు, నేనతనికి భృత్యుడను. అతడు నాకు పిత, నేనాతనికి పుత్రుడను. ఈ భావమువలన నేను పాలింప బడుదును. "ఓహో! ఎప్పుడు ఈ సత్యము భరతవర్షమునందు ప్రచారమగు నోగదా! అందరును ఎప్పుడు ఈ ప్రకారము ఈశ్వరుని పూజింతురోగదా! అయన మహిమ ఈవిధముగ ఎప్పుడు సర్వత్రౌ ధ్గోషింపబడునోగ దా" అని ఇట్లు సర్వదా తల్లడిల్లు వాడను. ఇదియే నాజీవితము యొక్క లక్ష్యమై పోయెను. ఈ లక్ష్యమును బడయుటకు ఒక ముద్రాలయము, ఒక పత్రిక అవశ్యమని తోచెను.తత్వబోధినీ సభ్యులు అ నేకులు కార్యాచరణ విషయములందు భేదాభిప్రాయములతో నుండినట్లు తోచెను. సభలవిషయమగు ప్రకటనలు వారి కందుచుండెడివి. ఆందినను అనేకులు రాలేక పోవుచుండిరి.వచ్చిన వారిలో అనేకులకు సభలో నేమిజరుగుచున్నదియు తెలిసెడిది కాదు. అనేకులకు, ముఖ్యముగా వ్యాపిం పవలసిన విద్యావాగీశుని యుపన్యాసములే వినుటకు వీలు లేకుండెను. రామమోహన రాయలు ,