పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,


బ్రహ్మజ్ఞానము వ్యాపింప జేయు నుద్దేశముతో తాను ప్రచురించిన గ్రంధములు, ఇంకను అనేకుల కందునట్లు చేయవలసి యున్నది. ఇంకను ప్రజల జ్ఞానమును అభివృద్ధి చేసి, వారికి చరిత్ర విషయములను తెలియ చేయగల అనేక విషయములను ప్రచురించుట అవశ్యకము. ఈయభిప్రాయములు మనసు నందుంచుకొని 1898 లో ఈ తత్వబోధినీ ' పత్రికాప్రచారము సంకల్పించు కొంటిని, దీనికొక పత్రికా సంపాదకుని నియోగించుట అవశ్యకమయ్యెను. సభ్యులలో ననేకుల వ్యాసరచనను పరీక్షిం చితిని గాని, అక్షయకుమారదత్తుని రచనా నైపుణ్యమును బట్టి యీతని నేర్పాటు చేసితిని. అతని రచన యిందు గుణములతో బాటు దోషములుకూడి ఉండెను. కానీ అది మధురముగను హృదయం గమముగను ఉండెను. ఇది గొప్పసుగుణము. కాని అతని యందొక లోప ముండెను.సంసారములను వదలి, వికార వేషముల వేసికొని, ఒడలంత బూడిడ పూసికొని ఆడంబరముగ జీవనము చేయు సన్యాసులగూర్చి అతడు ప్రశంసించుడెను.బాహ్య సన్యాసములు, వికృత వేషములు నామతమునకు విరుద్ధములు. ఐనను అతను వ్రాసిన యభిప్రాయములు నేను సరిచూచుట అతడు ఇష్ట పడిన యెడల నతనిని నియమింపవచ్చు ననుకొంటిని. అట్లే జరిగెను. 'పెద్ద జీతమునిచ్చి అక్షయ బాబును ఈ ఈ కార్యమునకు నియమించితిని. అతని వాతలలో నాయభిప్రాయములకు విరుద్ధమైన అభిప్రాయములున్నచో అతనినిగూడ నాయభిప్రాయమునకు తిప్పుకొనుటకు ప్రయత్నించు చుంటిని. కాని ఇదంత సులభముగ సాగ లేదు,కాలక్రమమున మాయిరువురి యభిప్రాయములును పూర్తిగా వ్యతిరేకములై పరిణమిం చెను. నేను ఈశ్వరునకు నాకునుగల సంబంధమును కనుగొన ప్రయత్నింపుచుంటిని. మానవ ప్రకృతికిని బాహ్యవస్తువులకును గల సంబంధమును కనుగొనుట కతడు ప్రయత్నించుచుండెను. మాచూయిరువురకును ఉండు భేదము ఆకాశ పాతాళ ప్ర బేధము,