పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము,

15

జ్ఞానప్రభావము వలన విశ్వసంసారమును సమస్తమును చూడగల్గితిని, సూర్య చంద్రాదులు మనకొరకే నియమితరీతిని ఉదయించి ఆస్తమిం చుచున్నవి. మనకొరకే వాయువును వర్షమును ఉపయుక్తముగ సంచలితములగుచున్నవి. ఇవన్నీయును కలసి మన జీవిత పోషణమను లక్ష్యమును సిద్దిచెందిచుచున్నవి. ఈలక్ష్యమెవరిది? జడము యొక్క లక్ష్యము కానేరదుగదా ! చేతనము యొక్క లక్ష్యమయి యుండవలెను. గౌవున ఈవిశ్వసుసారమునంతను నడుపుచున్నవాడొక చేతనావనుడు కలడని గ్రహించితిని.


శిశుపు భూమిష్టమగుటతోడనే తల్లి మీద స్తన్యపానము చేయును, శిశుపునకిది నేర్పినవారెవరు? ఎవ్వని తల్లి యొక్క స్తన్యములో పాలనుంచెనో ఆతడేకదా. ఎవ్వని శాసనము వలన యీజగత్సంసార మంతయు నిరాఘాటముగ నడచుచున్నదో అతడే విజ్ఞానవంతుడగు యీశ్వరుడు. ఎప్పుడు ఇంతవరకు జ్ఞానమునేత్రమును విప్పితినో అప్పుడంతపరకు ఆనందమును పొందితిని. వెనుకటి ఘనమగు విషాదముచాల వరకు అంతరించినది. మనసుకొంచము స్వస్థత చెందినది.చాలకాలము క్రిందట, చిన్న తనమునందు అనంతాకాశమునందు అనంతుని పరిచయమును పొందితిని. ఒక నాడు దీర్ఘాలోచన చేయుచుండగా నామనసు దానియందు లగ్నమైపోయెను. అప్పుడు అగణ్య నక్షత్రచకిత అనంతాకొశముపై దృష్టి నిల్పితిని. అనంత దేవుని దర్శించితిని. అనంత మహిమమునదేగదా, ఈశోభయంతయునని తెలిసికొంటిని. ఆయన అనంతజ్ఞాన స్వరూవుడు. మనలనుగూర్చియు మన నివాసములగు యీశరీరముల గూర్చియు నీకి చిత్తుజ్ఞాన మెవనినుండి మనము పొంద గల్గితిమో, అతడు అనంతజ్ఞాన స్వరూపుడు, శరీరశూర్యుడు, నిరాకారుడు. అతడివిశ్వమును అతని చేతులతో మలచి చెక్కి యుండ లేదు. కేవలము ఇచ్ఛామాత్రమున నీజగమును రచించినాడు. అతడు కాళీమ