పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.

ముదురు. ఈ మార్గమును త్యజించినచో ఇక జ్ఞానలాభము పొందుట కేమిఉ పాయమున్నది? అని ఒక సారి ఆలోచించుకొంటిని. పాశ్చాత్యదర్శనశాస్త్రము ఈ విషయమై నాకు కొంతస్ఫురింప జేసినది. నాస్తికునకు ప్రకృతిచాలును. అతనికి ప్రకృతికంటే రెండవ విషయమేదియు అక్కర లేదు. నాకుమాత్రమది సరిపోలేదు. ప్రకృతినిమించి సమస్త విశ్వమునకును ప్రభువగు ఈశ్వరుని దర్శించక 'నేనుండ లేక పోతిని. కాని ఈ యీశ్వర దర్శనమును కేవలము అంధవిశ్వాసముచేగాక జ్ఞానా లోకనము చేపొందవలయునని నా మహాప్రయత్నము. ఇది నెర వేర్చికొనలే కపోవుటచే నావ్యాకులత దినదినమును హెచ్చుచుండెను. ఒక్కొక్కప్పుడు జీవితము దుర్బరముగా తోచు చుండెను.


నాల్గవ ప్రకరణము.

నేనిట్లు యోచింపగా యోచింపగా, అకస్మాత్తుగా ఈ విషాదాందకారము మధ్య విద్యుల్ల తవలే నొక కాంతి మెరసెను. బా హ్యేంద్రియముల ద్వారా, అనగా రూప, రస, గంధ, శబ, స్పర్శలయోగమున విషయజ్ఞానము జనించుచున్నదని తటాలున గ్రహించితిని. ఈ జ్ఞానముతో బాబే, “ నేసేజ్ఞాతను' అనికూడ తెలిసికొనగల్గితిని. దర్శన, స్పర్శన, ఆఘాణ, మననములతో, దశిష్టను, స్రష్టను, ఘాత్రను, మస్త్రను నేనే అనుజ్ఞానమును పొందితిని. విషయజ్ఞానముతో బాటు విషయినిగూడ తెలిసికొన గల్గితిని. విశేష అను సంధానమువలన నేనీ జ్ఞానమును సంపాదించితిని. 'ఘోరాంధకారా వృతస్థానమునందొక సూర్యకిరణ రేఖ వచ్చి ప్రవేశించినది. విషయావబోధము, మనలను మనము తెలిసి కొందుమన్న సంగతిని గ్రహించితి. ఇటు పై నాలోచించిన కొలది,