పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


దానిని తప్పించుటకు గాను యీ స్టీమరక్కడికి వెళ్ళుచున్నది. ఇక్కడికి తిరిగి వచ్చి మూడుదినము లైన పిమ్మట కలకత్తాకు వెళ్లును. ” అప్పుడు నేనందులో నొకగది నద్దెకు తీసుకొనవ లెనని నా ఆత్రమును తెలియ జేసితిని. రోగులను, గాయము చెందిన వారిని సైనిక పురుషులను కల కత్తా తీసుకొనిపోవుటకు గాను ఈ స్టీమగును గవర్నమెంటు అద్దెకు తీసి కొనిరి పథకులకు గదులు దొరకవు. కానీ నీవు సైన్యాధ్యక్షుని వద్ద నుండి హుకుం తీసుకొని రాగలిగినచో నిన్ను తీసికొని వెళ్ళగల్గుదుము, ” అని అతడు చెప్పెను.


ఆతని యుప దేశానుసారము చాల సేపు వెదకి వెదకి పిమ్మట నాసైన్యాధ్యక్షుని కార్యాలయమును, ఒక పెద్ద బగాళాను చేరితిని. అప్పుడాయన ఇతర కార్యములో చాల తొందరగ నుండి నస్ను మరు నాడుదయమున రమ్మ నెను. ఉదయ మనిన ప్రభాత వేళ యో లేక 10 గంటలయే తెలిసి కొన లేక నేను ప్రభాతమున నే ఆయన ద్వారమున నుపస్థితుడనైతిని. కూర్చుడగా, కూర్చుండగా పదిగంటల య్యెను. అప్పుడాయన తన ఆఫీసుకు నన్ను పిలచెరు. నే నాయన వద్ద నామనవి వినిపించితిని. ఆయన యిట్లనెను, “ఈ స్టీమరులో సైనిక పురు షులు వెళ్ళుదురు. వారితో బాటు వారి భార్యాపుత్రా పరివారమునకు తప్ప యితరులకు స్థానము దొరకదు.” నేను, "భూమార్గమున పథికులు ప్రయాణము చేయరాదని గవర్నమెంటు వారు నిషేధించిరి. జలమార్గ మున గవర్నమెంటు వారి మనుష్యులతో సురక్షితముగా నాకు అవ కాశము దొరకు చున్నది; మీరు నన్నెందుకు వెళ్ళనివ్వరాదు? " నేను విద్రోహిదళములలో నొకడనేమోయని ఆయన మొదట అనుకొనెను. నామాటలువిని ఆయన నాసమాచారము అడిగెను. సిమ్లాలో హే ప్రభువు మొదలగువారితో నాకు పరిచయముండెనని తెలియ జేసి నాయావ ద్వృత్తాంతము చెప్పితిని. అప్పుడు నాకొక గది యివ్వవలసినదిగా