పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితో "మ్మిదవ ప్రకరణము.

211


స్టీమరు కెప్టనుకు ఉత్తరమిచ్చెను. ఈలోగా స్టీమను తిరిగివచ్చి కలకత్తా వెళ్ళుటకు సిద్ధముగ నుండెను. నేను వెళ్ళి కెప్టనుకు ఆయుత్తరమిచ్చి తిని, కొని యిప్పుడు కెప్టను యిట్ల నెను: “ ఈ యుత్తరము ప్రయోమేమి?

స్టీమరులో గదులు ఖాళీ లేవు; నీకు గది యెట్లివ్వగలను? “గదులు

ఖాకీ లేనిచో స్టీమరు పై భాగమున నైనను ప్రయాణము చేసెదను. అద్దె మాత్రము గదిఅద్దెయే తీసికొని అట్లు నెళ్ళనిమ్ము” అంటిని.'


స్టీమరుతోనున్న సామాను పడన కెప్టను, మా వితండము నాల కించి, మావద్దకు వచ్చి " స్టీమరులో గది లేదు, కాని నా పడవలోనున్న గదికి అదె యిచ్చినచో నేనది యిచ్చుటకు సిద్ధముగ నున్నాను.” అనెను. నేను, “సరే, సొమ్ముయి చ్చెదను, నీగది నాకు విడుపు మంటిని అతడు “ సీసామాను కొనిరమ్ము, నే నీలోగా గది సిద్ధ పరచి యుంచె దను,” అనెను. అప్పుడు నే నామాటలు విని ఎంతయో ఆహ్లాదపడి పరుగు పరుగున ఇంటికి పోయి నా సమస్తవస్తువుల గొనివచ్చితిని. చిర సుహృదుడైన నీలకమలమిత్ర మార్గమున భుజించుటకుగాను నాకొక బుట్టలో మిఠాయి నిచ్చెను. అది నాకు బహు ఉపకార మొనర్చెను.


స్టీనురు త్వరలో కలకత్తా అభిముఖమై బయలు దేరెను. కాని కాళీ చేరుసరి కొక విఘ్నము వచ్చెను. ఈ సామాను పడనకొర కింకొక స్టీమరు వచ్చుచున్నదనియు, ఇది వెనుకకు పోయి మరియొక సామాను పడవ తెచ్చుకొనవ లెననియు కెప్టనుకొక తంతి వార్త వచ్చెను. కెప్టను ఈ టెలిగ్రామునందుకొని మిక్కిలి కోపించి యిట్లనసాగెను. “ నేనింక గవర్నమెంటు చాకిరీ చెయ్యను. గవర్నమెంటువా రెప్పుడేమి ఉత్తరువు నిత్తురో ఎవరికి తెలియదు. ఇంతదూరము వచ్చినపిమ్మట వెనుకకు పొమ్మచుట మాతము మిక్కిలి దుర్నయము,” కెప్టను కింటికి పోవల యునని మిక్కిలి యాతురతగానుండెను. సామాను పడవ వదలి స్టీమర్ పైనున్న ఉద్యోగులు, స్త్రీలు సహితము వెనుకకు పోవలసి యుందురు,