పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది తొమ్మిదవ ప్రకరణము

209


యుండిన యిద్దరు మనుష్యులు బండి దిగి వచ్చి నాతో యిట్ల విరి, “కోట చెంత మా ' లాల్ కూటము'న్నది; మహాశయా, అనుగ్రహించి మీర క్కడ నుండెద రేవి మేము మిగుల కృతార్దులమయ్యెదము. ఇప్పుడు మా పితృ మురణదినములు.” నేను వారితో ఆగృహమునకు పోతిని. వారికొక గృహ దేవత యుండెను. అతని నైవేద్యములోనుండి... నాకు సాయంకాలము రొట్టెలు పప్పు వచ్చెరు. నేనప్పుడు మిక్కిలి ఆకలితో నుంటిని, నేనారొట్టె పప్పు మిక్కిలి యిష్టముతో భుజించితిని. తృప్తి పూర్వకముగా నదంతయు భుజించి ఇకను వచ్చునని యాసించితిని. కాని న న్నెన్వరు నడుగ లేదు. నేనాప్రసాదమును భుజించి నాటికక్కడ విశ్రయించితిని

ముప్పది మన ప్రరణము.

..


మరు నాడు అలహా బాదు వీధులందు పథికుల కీరీతీగ ప్రకటన లుండెను. “ఎ.వరైనను పూర్వదిక్కునకు దూరముగ వెళ్ళగోరెద రేని, వారి ప్రాణములకు గవర్న మొంటువారు ఉత్తరవాదులు కారు " ఈ ప్రకటన చూచి నా మనస్సు విశేషము కలగెను. దినాపురమందు కుమారసింగికను యుద్ధము చేయుచుండెనని వింటిని. భూమార్గ మన్ని విపత్తులతో కూడి యుండినచో, జలమార్గమున పోవుట ఎక్కువ సురక్షితముగా నుండదా అనుకొంటిని.ఇట్లు భావించుచు నేను గంగాతీరమునకు విహారార్ధము పోతిని. పోయి చూడగా ఒక స్టీమకు నుండి థూమము వచ్చుచుండెను. అది అప్పుడు బయలు దేర బోవు చుండెను. నేను పరుగెత్తి దాని పై నెక్కితిని. స్టీమరెక్కడికి వెళ్ళు నని కెప్టను నడిగితిని. అతడిట్లని ప్రత్యుత్తరమిచ్చెను, “ ఒక స్టీమరు కొంచెము దూరమున గంగా మధ్యమున ఇసుక మెట్టకు తగుల్కొనెను.