పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.

మాత్రము, “ఆ రెండు నిలువుటద్దములు, ఆ బొమ్మలు ఈజరీ పంచల జత నాకిమ్ము,” అని అడిగెను. తక్షణమే అవన్నియు నిచ్చి వేసితిని. మరునా డాతను కూలీలను తెచ్చి కచేరి సావడిలోని వన్నియు పట్టించుకొని పోయెను. వానిలో కొన్ని ముచి మంచి బొమ్మలు, ఇతరము లైన విలువగల వస్తువులుకూడ ఉండెను. అతడన్నిటిని తీసికొని పోయెను. ఈవిధముగ నాసామానంతయు నిచ్చి వేసితిని. గాని నామనస్సులోని విషాదము మాత్రము యధాప్రకారముగనే యుండెను. దాని 'నేదియుతరుమ లేకపోయెను. ,చిత్త శాంతి నెచ్చట పొందగలుగుదునో తెలియదాయె. ఒక దినము పడక కుర్చీపై పరుండి ఈశ్వర విషయమైన సమస్యల నాలోచించి ఆలోచించి ఆధ్యానములో నిమగ్నుడ నైతిని, ఆపరాధ్యానములో ఎప్పుడు లేచితినో, ఎప్పుడు భుజించితినో తిరిగి ఎప్పుడు శయనించితినో నాకేమియు తెలియ లేదు. సర్వదా అచ్చటనే పరుండినట్లు తోచు చుండెను. సమయము దొరకినపుడెల్ల మట్టమధ్యాహ్నము "షాలిమార్ ఉద్యాన వనము”నకు (Botanical gardens) పోవుచుంటిని. అది కడునిర్జన ప్రదేశము. ఉద్యానవనము మధ్య నొక సమాధి స్తంభముకలదు.నేను దానిపై కూర్చుందును. సామనస్సులో విషాదము మెండుగ నుండెను. నలుదిక్కులను అంధ కారము. నాకిపుడు విషయప్రలోభనములు దూరమైనవి, కాని ఈశ్వరభావము మాత్రము ఇంకను రాలేదు. ఐహిక సుఖములను వదలు కొంటిని కాని స్వర్గీయానందమును పొందలేక పోతిని. ఇట్లు రెండింటికిని దూరమై జీవనము రసవిహీనమయ్యెను. ప్రపంచము స్మశానతుల్యముగ నుండెను. 'దేనియందును సౌఖ్యముగాన రాదాయె, దీనివల్లను శాంతికలుగదాయె! మట్టమధ్యాహ్నపు సూర్య కిరణములు సహితము "తేజోవిహీనములుగ తోచుచుండెను. అట్టి అపస్థలో ఈకింద కీర్తన నాకంఠమునుండి వెలువడెను:

“ఈ బే ఆహా బే దిబా ఆలోకే, జాన్ బినాషబ్ అంధ కార్”