పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

9


ర్మూలిత కర్ముడైన ముని ముఖ్యుడుగానీ కుయోగిగానగా
జూలడు సీదుకోర్కి కొన , సాగుట కైనిజమూ జూపితిన్".


నేను సరిగా ఇదేస్థితి యందుంటిని. నాటి యానందమును పొందలేక అత్యంత విషణ్ణుడ నైతిని. ఈనారదుని కథతో నాకథ ఒక్కవిషయములో మాత్రము కలియుట లేదు. ప్రప్రథమమున అతడు ఋషీశ్వరుల నోటినుండి హరిగుణాను వర్లన విన్న వాడగుటచే నాతని హృదయములో శ్రద్ధాభక్తులు జనించినవి. పిమ్మట వారి వద్ద బ్రహ్మజ్ఞానమును గురించి అనేక ఉప దేశముల నాయన పొందెను. కాని నేనెవ్వరినోటి నుండి వింటిని ? అందుచే భక్తిశ్రద్ధలపొందు యోగము నాకు ప్రాప్తించ లేదు. బ్రహ్మతత్వమును నాకు ఎవ్వరును అనుగ్రహించ లేదు. అహర్నిశములు విలాసామోద వాయువులు నాకు అనుకూలముగ వీచుచుండెను. అయినను ఇంత ప్రతికూలావస్తలో సహితము ఈశ్వరుకు తన యపారకృపచే నామనసున వైరాగ్య ముదయింపఁ జేసి నాహృదయము నుండి సంసారాసక్తిని తొలగించెను. పిమ్మట తన ఆనంద ధారల నాహృదయమున వర్షింపజేసి నాయందు నూతన జీవనము నంకురింప జేసెను. ఈశ్వరుని యొక్క యీకృపావి శేషము అనుపమానము. అతడే నాకు గురుపు. అతడేనాకు తండ్రి,

మూడవ ప్రగణము

ఆవ్వ చనిపోయిన పిమ్మట ఒక నాడు కచేరి సావడిలో కూర్చుండి దగ్గరనున్న వారిలో, “ఈరోజున నేను కల్పతరువయితిని. నేనివ్వగలిగిన వానిలో నెవ్వరేది అడిగిసను ఇచ్చెదను.” అంటిని. తక్కిన వారెవ్వ రేమియు నడుగ లేదు; కాని మా పెద్ద తాత కుమారుడు వ్రజబాబు