పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

11


"వ్యరము, పట్టపగటి కాంతి అంతయు వ్యర్ధము; జ్ఞానజ్యోతి లేనిదే అంతయు అంధ కారమే!


ఇదియే నా మొదటి గీతము. ఆచలువరాతిపై నొంటరిగ కూర్చుండి ఈ గానమును ముక్తకంఠముతో స్వేచ్చగా పొడుచుండువాడను.


అప్పుడు నాకు సంస్కృతము నేర్చి కొనవలెనని కుతూహలము కలిగెను, చాణక్యుని శ్లోకములను యత్నపూర్వకముగా కంఠస్థము గావింప ప్రారంభించితిని. కొన్ని మంచి శ్లోకములు కనుబడి నప్పుడెల్ల వానిని అట్లే కంఠస్థము చేయువాడను. అప్పుడు మాయింట ఒక సంస్కృత పండితు డుండెను. అతని పేరు కమల కాంత చూడామణి, ఆయన గ్రామము ' బాశ బేడా ' పూర్వమాతడు గోపీ మోహన ఠాకూరు నాశయించియుండెను. తరువాత మాటంట పండితుడయ్యెను. అతడు విద్యావం తుడును, తేజోవంతుడునై యుండెను. 'నేనప్పుడల్స వయస్కుడను. నాయందాతనికి మిక్కిలి యిష్టము. నేనును ఆయనను భక్తితో చూచువాడను. ఒక నాడాయనతో, “మీవద్ద ముగ్దబోధ వ్యాకరణము చదివెదను” అంటిని. ఆయన, “మంచిది నీకు నేర్పెదనులే.” ఆనెను. పిమ్మట చూడామణివద్ద వ్యాకరణమును ప్రారంభించి 'కచటతప' లు, 'గజడదబలు' కంఠోపాఠముగ నేర్చికొన నారంభించితిని, సంస్కృత భాషలో ప్రవేశము నందుటకు ప్రథమమున చూడామణివద్ద వ్యాకరణము చదువుట కుత్సహించితిని. ఒకనాడాయన స్వహస్తముల తీ వ్రాయబడియున్న కాగిత మొకటి 'మెల్ల మెల్లగ తీసికొనివచ్చి నాచేతిలో " దానిపై నన్ను సంతకము చేయమనెను. చదివి చూడగా, తనకుమారుడగు శ్యామచరణుని నేను పోషింషనలయునని అందు వ్రాయబడియుండెను. "నేను సంతకము చేసితిసి, చూడామణియందు విశేషభక్తి గౌరవములు కలిగియుండుటచే ఏమియు సంకోచింపక ఆతని కోరిక ప్రకారము సంతకము చేసితిని. అందలి విషయమునుగూర్చి