పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


ఆసమయమున కొంచమైనను ఆలోచింపలేదు. తరువాత కొంతకాల మునకే మాసభాపండితుడు చూడామణి మృతినొందెను. అప్పుడు శ్యామచరణుడు ఆ కాగితము నావద్దకు దెచ్చి, “నాతండ్రి పరలోకగతు డయ్యెను. నేను నిరాశ్రయుడను. మీరిప్పుడు నన్ను పోషింపదగును. ఇదిగో చూడుడు, తామిదినరకే వాగ్దానముచేసిరి.” అని అప్పుడు నేను సంతకము చేసిన కాగితమును చూపెను. ఇందుకు నేనంగీక రించితిని. అప్పటి నుండియు శ్యామచరణుకు నావద్దనే యుండెను. అతనికి సంస్కృతమునందు కొంచెము ప్రవేశము కలదు. ఈశ్వర తత్వ నమే గ్రంధమునందు పొందనగునని అతని నడిగితిని, మహా భారతములోనని యతడు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు నేనతనివద్ద మహా భారతము చదువ నారంభించితిని. ఆగ్రంధము తెరువగనే ఈశ్లోకము నా కెదురు పడెను.


శ్లో| 'ధర్మ మరిర్భవతునః సతతోద్ధితానాం
సహ్యేక ఏవ పరలోక గతస్య బద్దు:
అర్ధా స్త్రీయశ్చనపు నేరపి సేవ్యమానా
నై వాస్త భావముపాతిన చస్థయిరత్వం"


“ధర్మము నందాసక్తి ఉండునుగాక. సతతము ధర్మము యెడల అనురక్తి కలిగియుందువు గాక. పరలోకగతులయిన వారికి ఆధర్శమొక్కటే తోడగును. ధనమును స్త్రీలును చంచల స్వభావముగలవి. వాని నెంత సేవించినను అవి నీకు లొంగియుండవు. "


మహాభారతము నందీశ్లోకము చదువగనే నాకుత్సాహము జనించినది.


బంగాలీ ఆంగ్లేయ భాషలలో వలెనే అన్ని భాషలను విశేషణ ములు విశేష్యములకు ముందుండునని యభిప్రాయ పడుచుంటిని. కాని సం