పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193

ముప్పదియారవ ప్రకరణము,



శిరముపై పోసికొనుచుంటిని. అప్పుడు ఒక్క నిమిషము నాహృదయ శోణి ప్రవహించుట మాని నురుకుణమున ద్విగుణము గావింపబడిన వేగముతో ప్రవహించి నాశరీరమందు సమాధిక తేజస్ఫూర్తులు సంచ రింప జేయుచుండెను. పుష్య మాఘ మాసముల శీతలమునులు సహి తము నేను గృహమునకు ఆగ్ని జ్వలి, పచేయ నివ్వకుంటిని. శీతల మును ఎంతనరకు శరము సహింప గలుగునో పరీక్షించుటకును తితీకు, సహిష్ణుత అభ్యసించుటకును నేనీ నియమము నవల బిచుచుంటిని. రాత్రులందు నేను నా నేను నాశయ్యాగృహము తలుపులు తెరచి యుంచెడి? వాడను. రాత్రి యొక్క ఆశీత వాతము నేను మిక్కిలి ప్రేమించు చుంటిని. కంబళీ కప్పుకొని పక్కపై కూర్చుండి సమస్తమును మరచి అర్ధ రాతి పర్యంతము బ్రహ్మగీతములు, హఫీజ్ విరచిత పద్యములు పాడు చుండెడి వాడను. మేల్కొని యుండగలిగినవాడు యోగి. భోగియు, రోగియు ఎక్కడ మేల్కొని యుండగలరు? “బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ ధ్యాని, బ్రహ్మానందరసపాని_బ్రహ్మమును ప్రేమించువాడు ఎవ్వడో అతడే మేల్కొని యుండువాడు. ”

“ ఏదీపము రాత్రిని పగలుగా మార్చునో ఆదీపు మెవ్వరిగదిలో నున్నది?


ఆయ్యది నాహృదయమును దగ్ధము గావించినది.మరిఎవరికి అది ఆనందము నొనగూర్చినది ? *

ఏరాత్రులందాతని సహవాసము నెక్కువగ ననుభవించితినో అప్పుడు మత్తుడనై అతి ఉచ్ఛస్వరము . [1]* నిట్లను వాడను.


  • «

"హాఫీజ్"

  1. యారబ్ ఆఁ షమైషబ్ ఆఫ్ రోజ్" "'రోకాసాపై కీస్ | జానెమా నూఖ్, బఫుర్సీదొ కెజా నా పై కీస్ II "