పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్' స్వీయచరిత్రము.


" నేడు నాసభామండపము లోనికి దీపము తీసికొని రావలదు, నేటి రాతి ఆ పూర్ణచంచుడు, నాప్రాణ మిత్రుడు ఇచ్చట విరాజమా నుడై యున్నాడు. " *[1]


రాత్రులీరీతిగా నానందముతో గడపుచుంటిని. పగటివేళ గభీరబాహ్మచింతనలో నిమగ్నుడనై యుంటిని. ప్రతిదినము రెండుజా ములవరకు నేను దృఢ ఆ సన బద్ధుడనై ఏకాగ్రచి త్తములో ఆత్మ యొక్క మూలతత్వాలోచన యందును అను సంధానమునందును ప్రనృత్తుడనై యుంటిని. అవ శేషమందు "నేనీ సిద్ధాంతమునం దుపనీతుడ నైతిని, మూలతత్వమునకు విరుద్ధమైన భావనలకు మనసునందు స్థానముండదు. అవి ఏమనుష్యుని యొక్కయు వ్యక్తిగత సంస్కారములు కావు. అవి సర్వ కాలములందును నిర్వ శేషముగా సర్వవాదీ సమ్మతములు. మూల తత్వము యొక్క ప్రామాణికత ఇం కెవ్వరిపై నాధారపడి యుండ లేదు. దానికదే ప్రమాణము. అది స్వతస్సిద్ధము. దీనికిదే కారణము. అయ్యది ఆధ్యాత్మిక ప్రజ్ఞచే ప్రతిష్ఠింపబడినది. ఈమూలతత్వముపై సాధార పడి యుపనిషత్తుల వ్రాసిన పూర్వఋష్ముట్లు వచించిరి :

ఎవ్వనిద్వారా యీవిశ్వచకము అమ్యమానమగుచున్నదో ఆపరమ దైవము యొక్క మహిమయిది " t[2]

కొందరు కొందరు పండితులు మోహమునందు ముగ్ధులై ప్ర కృతి స్వభావమువల్ల — జడము యొక్క అంధశక్తివల్ల ......ఈ ప్రకాండ జగత్తు చలించుచున్నదని చెప్పుదురు. మరికొందరు ఏకారణమువల్లను కాదు, 'కాల ప్రభావమువల్ల నందురు. కాని నేను చెప్పునది..ఎవ్వని



  1. * గద్దరూ మయారీద్ దరీఁ జమా కే ఇంషత్ | దర్మత్లీనే మామా సారో దోస్త్ తమా మస్తే || (హాఫీజ్)
  2. "డేనస్తైయష మహిమా తులో యే దంభౌమ్య తే బ్రహ్మద్యం"