పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియారవ ప్రకరణము.


ఇప్పుడు హిమాలయము లందు వర్ష ఋతువు ప్రారంభమయ్యెను. ఈశ్వరుని జలయంత్రములు దివార్రాతములు తిరుగ జొచ్చెను. చిర కాలము నేను మేఘముల నూర్ధ్వమున జూచు చుంటిని. ఇప్పుడు అధంతనపర్వత పాదములనుండి శ్వేత బాష్పమయ మేఘములు లేచు చుండుట నిక్కడ గాంచితిని. ఇది చూచి నేనాశ్చర్యము నందితిని. క్రమక్రమముగ నవి పర్వతమును శిఖర పర్యంతము ఆచ్ఛన్నము గావించెను. పూర్వఋషి భావక ల్పితమగు మేఘావృత ఇంద్ర సామ్రాజ్య మును నేను ప్రత్యక్షముగ నచట గాంచితిని. క్షణ కాలములో వర్షము కురిసి మేఘములు పరిష్కారములయ్యెను. మరల పర్వతముల నుండి దూదిపింజలవలె మేఘములు లేచి సర్వమును ఆచ్ఛన్నము గావించెను. వెంట నే వర్షము కురిసి మరల సూర్యుడు ప్రకాశించెను. ఈవిధముగ ఈశ్వరుని జలయంతము: దివారాత్రములు పనిచేయ జొచ్చెను. శ్రావణమాస ఘోరవర్షములందు ఒక్క పక్షమంతయు సూర్యదర్శన ముండదు. సమస్తమును మేఘావృతమైయుండును. సృష్టియందంతటను నేనును నా చెంత నీశ్వరుడు దక్క మరెవ్వరును లేరనునట్లు దోచును. అప్పుడు సహజముగ నామనస్సు సంసారము నుండి విడుదలయై, నాయాత్మ సమాహితమై పరమాత్మ యందు విశ్రామమునొందెను, భాద్ర పదమాసములో హిమాలయముల జటాజూటముల మధ్య జలకల్లోలము విషమకోలాహలము సలుపుచుండెను. దాని ప్రసనణములన్నియు పరిపుష్టిగ నుండెను. నిర్ఘహరములన్నియు ప్రముక్త ములై యుండెను. మార్గములన్నియు దుర్గమముగ నుండెను. ఇక్కడ ఆశ్వయుజ మాస ములో శరత్కాల వికాస మెంతమాతమును "లేదు. కార్తిక మాస మునుండియు అనావృత శరీరములను శీతలవాయువులు వణకించు చుండెను;