పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

మహర్షి జీవేంద్రనాధళాకూర్" స్వీయచరిత్రము.



నుండియు నిక్కడ నుండ లేదు. ఎప్పుడు మీయాజ్ఞను మీరి మీతో 'రా లేక పోతినో, అప్పుడే యనుశోచనతోడను, అనుతాపము తోడను ఒక్కసారి వ్యాకులుడ నైపోతిని, ఇంక నిచ్చట నుండజూలక పోతిని, పర్వతము నుండి కిందికి దిగి 'జ్వలాముఖి' చేరితిని. అచ్చట ' జ్వాలాముఖి యొక్క దావానల తాపమువల్లను, సూర్యుని జ్యేష్ట మాస రౌద్రమువల్లను మల మల మాడితిని. అందుచే నేనిచటకు తిరిగి వచ్చుసరికి నాముఖము నల్ల బారి యుండెను. నాకిది తగిన ప్రతిఫలము. నేను మీయడల విశేషాపరాధము జేసితిని. ఇంక తమ వద్ద నన్నుండని చ్చెదరను ఆశ లేదు, ” అనెను. " నీకు భయము లేదు. నీన్ను క్షమించెదను. నావద్ద నిదివర కెట్లుంటివో ఇటుమీదట నట్లే యుండుము, అని నేను హసించుచు పల్కితిని.


“ నేను క్రింది కిపోయి నప్పుడొక నౌఖరు నిచటనుంచి పోతిని. వచ్చిచూచు సరికీ అతడు పలాయితుడై యుండెను. తలుపులన్నియు మూయబడి యుండెను. తలుపులు తెరచి ఇల్లు ప్రవేశించితిని. మన వస్త్రములు, పెట్టెలు ఎక్కడి వక్కడయుండెను. అత డేమియు పట్టు కొని పోలేదు. నేను మూడు దినముల క్రితము మాత్రమే ఇక్కడకు వచ్చియుంటిని అని అతడు చెప్పెను. ఈ సంగతి విని ఉలికిపడి లేచితిని. నేనిక్కడకు మూడు దినముల క్రితము వచ్చియుండినచో చాలయిబ్బంది పడియుం డెడివాడను. ఈ యిరువది దినములనుండి పర్వతభమణమునందు నాశరీరము ననేక భౌతిక విపత్తులనుండి ఎన్ని సారులో రక్షించుచు, నామనస్సునకు ధైర్యము, సహిష్ణుత, వివేకము, వైరాగ్యము మొదలగు ఉచ్ఛతర పాఠములు గరపించుచు ఆయన సహవాససుఖముచే నా ఆత్మకు ఎంతయో పవిత్రతయు, ఔన్నత్య మును ఒడగూర్చుచున్నందలకు ఈశ్వరునందు కృతజ్ఞత నాహృద యము భరింపలేక పోయెను. నేనాయనకు భక్తి భావముతో ప్రణా మముగావించి గృహము ప్రవేశించి ఆయన ప్రేమగానము గావింప నారంభించితిని.