పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

189

ముప్పదియైదవ ప్రకరణము.



ఉపాసన అయిన పిమ్మట కొంచము దుగ్దము పానము చేసి అయిన పిమ్మట దుగ్ధము యాస్థలమును వదలి వెళ్ళితిని. పొతః కాలమున మరల నిక్కడనుండి ఆరోహణ గావించి రెండుజాముల వేళ 'దారుణఘాట్ ' అనునొక దారుణ ఉన్నత పర్వత శిఖరమున నుపస్థితుడ నై తిని. సమ్ముఖమున మరియొక దారుణ ఉన్నత పర్వతశృంగము తుషా రావృతమై ఉద్యతవజ్రమువలె నీశ్వరుని మహద్భయ మహిమ నున్నతముఖముతో, ఘోషించు చుండెను.


ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు దారుణఘాట్ న నుపస్థితుడ నై సమ్మఖస్థిత తుషా రావృత పర్వతశృంగముపై నాళ్లిష్ట మేఘావళినుండి తుషార వర్షము కురియుట జూచితిని. సిమ్లా వాసులకు సహితము ఆషాఢమాసమున తుషారవర్లము ఆశ్చర్యకరము. ఎందువల్ల ననగా చైత్రమాసము ముగియక పూర్వమే సిమ్లా పర్వతము తుషార జీర్ణ వస్త్రము పరిత్యజించి వై శాఖ మాసమున మనోహర వసః తాంబరముల ధరించును. ఆషా శుద్ధ విదియనాడు ఈ పర్వతము నవరోహణ చేసి 'శిరహన్' అను మరియొక పర్వతమున నుపస్థితుడనైతిని. ఇచట రాంపూర్ రాణాకు చెందిన గృహ మొకటి యుండెను. గీష్మకాల మున రాంపురమున నుత్తాపు' మధిక మయినప్పుడు, శీతలవాయు సేవ కై రాజు ఇక్కడకు వచ్చుచుండును. పర్వత తలములందు గీమ్మకాల ములో మన దేశములందు కంటెను ఉత్తాప మధికముగ నుండును. పర్వత శిఖరములందు మాత్రమే ఎల్లపుడుసు శీతల వాయువు లుండుట.

ఆషాఢ శుద్ధ చతుర్థి నాడు ఇచటనుండి బయలు వెడలి, శుద్ధ త్రయోదశి నాడు ఈశ్వర ప్రసాదమువల్ల నిర్విఘ్నముగ నా సీన్లూ ప్రవాసగృహమున మూయబడి యున్న ద్వారము కడకు వచ్చి తలుపు తట్టితిని. కిశోరి తలుపు తెరచి సమ్ముఖమున నిలువబడెను. ఏమి, నీ ముఖమిట్లు నల్ల బడినది ? " అని అడిగితిని. అతడు, " నేనన్నాళ్ళ

-