పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియైదవ ప్రకరణము.

185

185


ములుమాత్ర ముండెను. కాని వాటి నరణ్యములన రాదు. ఉద్యాన వనములను మించి యుండెసవి. " కేలు' వృక్షము దేవదారువలె దీర్ఘముగను, అవక్రముగ నుండును. దానిశాఖలన్నియు నగ భాగమువరకును వ్యాపించి యుండును. సరుగుడు చెట్లయాకులవలెయుగు సన్నని సూదులవంటి యాకులచే దట్టముగ నలంకృతములై యుడును. ఒక' పెద్ద పక్షి యొక్క పక్షములవలె ప్రసారితములై, ఘనవతావృతము లైయున్న యాశాఖలు శీత కాలమందు విశేష హిమభారమును సహించియుండును. "కాని యా పత్రములీ హిమముచే జీర్ణించి వడలక మరింత పచ్చబడి పుష్టినొందును. ఎంతటియాశ్చర్యము ! ఈశ్వరుని కార్య మేది యాశ్చర్యము కాదు ? ఈ పర్వతము పై నుండి కిందివరకును ఈవృక్ష సముదాయము సైన్యదళమువలె బారులు తీర్చి నిలచియుండెను. ఈ దృశ్యముయొక్క మహత్య సౌందర్యము లేమానవ నిర్మిత వనమున కుండును? ఈ ' కేలు' వృక్షములకు పుష్పములు లేవు. ఇవి వనస్పతులు; వాని ఫలములు చాల నికృష్టములు. కాని వీనినుండి మనకుచాల యుపకారము కలదు. వీటినుండియే తారు బయలు దేరును.కొంత దూరము 'నడచిన పిమ్మట సవారి నెక్కితిని. మార్గ మధ్యమున స్నాన యోగ్యమగు జల ప్రస్రవణమును గాంచి యందు శీతల తుషారాంబువుల స్నానమాడి, నూతనస్ఫూర్తి వహించి బ్రహ్మోపాసన గావించుకొని పవిత్రుడనై తిని. మార్గమున నొక మేకల యెక్కయు, “ఓబీల'* [1]యొక్కయు మంద పోవుచుండెను. సవారిబోయి యొకడొక మేకను పట్టి తెచ్చి “దీనినుండి మనకు పాలుదొరకును' అనెను. దాని నుండి యొక పావు సేరు పాలు లభించెను. ఉపాసనానంతరముననే నాకుమార్గ మధ్యమున నామామూలు ప్రకారమా దుగ్ధము లభించినందు కీశ్వరునకు ప్రణామము లాచరించి వానిని ద్రావితిని.



21

  1. హిమాలయా ప్రాంతములందుండు "ఒకజాతి మృగము ,