పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

మహర్షి దేవేంద్ర నాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


కరుణారసమున నిమగ్నుడ నై యుండి సాయంకాలమునకు శుంఘ్రీయను నొక పర్వతశిఖరము చేరితిని. దినము ఎట్లుగడచిపోయెనో, ఎప్పుడు గడచిపోయెనో, నేనేమియు నెరుగను. ఈయున్నత శిఖరము నుండి పరస్పరాభిముఖము లై యున్న రెండు పర్వత శ్రేణులశోభను తిలకించి పులకాంకితుడనై తిని. ఈ శ్రేణీ ద్వయమున నొక పర్వతము పై బల్లూకాది క్రూరజంతువుల కాలవాలమగు యొక నిబిడారణ్యముండెను. మరియొక పర్వతము ఆపాదమస్తకము పక్వగోధుమ క్షేత్రములవల్ల కాంచనవర్ణముదాల్చి విరాజిల్లుచుండెను. అచ్చటచ్చట దూరదూరమున పది పండ్రేసి గృహములు మాత్రముగల కొన్ని గ్రామములు సూర్య కిరణములవల్ల దీప్తి వహించి కాన్పించుచుండెను. కొన్ని పర్వతములు చిన్న చిన్న తృణముల" నాపొదమ స్తకము భూషితము లైయుండెను. మరి కొన్ని పర్వతములు పూర్తిగ తృణశూన్యము లై యుండి సమీపముననున్న వనాకీర్ణ పర్వతముల శోభను మరింత యభివృద్ధి గావించుచుండెను. ప్రతి పర్వతమును నిజౌన్నత్యగరిమచే నిశ్శంకగ గంభీరముగ నిలబడి యుండెమ. కానీ యాపర్వత గర్భములుదు దిరుగాడు పథికులు మాత్రము సర్వదారాజభృత్యుల కైవడి భయవినయములతో మెలగుచుండిరి. ఒక్కయడుగు దప్పినచో ఆశ లేదు. సూర్యుడ స్తమించెను. అంధ కారము క్రమముగ భువనము నాచ్ఛన్నముగావింప నారంభించెను. ఇంకను నేనా పర్వతశృంగమున నేకాకినై కూర్చుండి యుంటిని. దూరము నుండి పర్వతము పై నందందు. మినుకు మినుకు మనుచు ప్రకాశించుచున్న దీపములు మాత్రము మనుష్య వాస మచట నున్నట్లు సూచించుచుండెను.

మరునాటి పాతః కాలమున నావనాకీర్ణ పర్వతమును కాలినడ కనే నవరో హింపనారంభించితిని. పర్వతారోహణమెత కష్టమో, తద వరోహణమంత సులభము. ఈ పర్వతముపై కేవలము ' కేలు' అరణ్య