పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


పిండి యవలు కలిపి చేసిన ఆరొట్టె నొకటి నేను వారివద్దనుండి కొంటిని. అందులో నొక భాగము నాడు నాకాహారమయ్యెను. నాక దియే సరిపోయెను. “ ఏదోకొంచము కొయ్యరొట్టి ముక్క ; అందుప్పున్న నేమి, లేకున్న నేమి ? తలయెగ్గిన తర్వాత ఇంక యీవిచారము లేల? ”కొంత సేపైన పిమ్మట కొందరు కొండవాండ్రు చెంతనున్న గ్రామము నుండి అంగములు నానా ప్రకారములుగా త్రిప్పుచు ఆమోదముతో సృత్యము చేయ సాగిరి. అందులో నొకనికీ ముక్కు లేదు. ముఖమంతయు చదునుగా నుండెను. నీముక్కట్లున్న దేమి అని నేనతని నడిగితిని. 'ఒక భల్లూకము నన్ను ముఖముమీద కొట్టెను, అదిగో ఆ మార్గమున నే భల్లూకములు వచ్చుచుండగా నేను దాని కొరకు వెళ్ళితిని. తన పంజాతో సది నాముక్కు ఎదురుగా కొట్టను. " అని ఆతడు చెప్పెను. కాని ఆ వికారపు ముఖముతోనే ఆతడెంతయో ఆనందముతో నృత్యము చేసి ఆమోదించు చుండెను. ఆకొండవాళ్లీ సరళ ప్రకృతి చూడ నాకధిక ప్రీతి కలిగెను.


మరుసటి ప్రాతఃకాలమున ఆస్థలము వదలి మధ్యాహ్నంకొక పర్వత శిఖరము చేరి అచట నాగితిని, అక్కడి గ్రామస్థులనేకులు వచ్చి నాచుట్టును మూగి కూర్చుండిరి.“మా జీవిత మిచ్చట బహుకష్ట సమన్వితము. మంచుకురియు దినములలో సర్వదా మోకాలి లోతు మంచులో నడచిపోవు చుందుము. పంటల కాలములో ఎలుగుగొడ్లు, ఆడవిపందులు వచ్చి మా పైర్లన్నిటిని నాశము చేయుచుండును.రాత్రులందు మంచెలపై కూర్చుండి పొలములు కాయు చుందుము,”అని వారు చెప్పిరి. వారి గ్రామమా కొండలోవలో నుండెను. వారు నాతో “మాగ్రామమునకు రండు. అచ్చట మాయింట సుఖముగానుండ గలుగుగురు. ఇచ్చటనున్నచో మీకు చాల కష్టముగా నుండును” కానీ నేనా సంధ్యా సమయమున ' వారిగ్రామమునకు పోలేదు,