పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియైదవ ప్రకరణము.

179



రెండుగంటలు ప్రయాణము చేసి మరియొక పర్వతమువద్దకు రాగా దాని పార్శ్వమున నున్న పర్వతమునకు బోవు వంతెన తెగి పోయియుండెను. ఇకముందు మార్గము లేదు. బోయవాండ్రు సవారి దింపిరి. యిచ్చట నుండి వెనుకకు పోవలెనా యేమీ? బోయవాండ్రు " “ విరిగిపోయిన వం తెనను పట్టుకొని మీరు మెల్లగా దాటి పోగలరేని మేము కొండదిగి ఖాళీ సవారీలో ఆవల ప్రక్కను మిమ్ము కలసి కొందుము,” అని చెప్పిరి. నేనట్లు చేయుటకు సాహ సించి ఆయుపాయము నవలంబించితిని. నాకప్పుడంత యుత్సాహము గానుం డెను. కమ్మిపై నొకపాదముంచుటకు మాత్రము స్థాన ముండెను. చేతులానుకొనుట కిరుప్రక్కలను ఆధారము లేక పోయెను. కింద భయానక మైన లోయ యుండెను. ఈశ్వర ప్రసాదము వల్ల నేను దానిని నిర్విఘ్నముగా దాటితిని. ఈశ్వర ప్రసాదమున్నచో “ కుంటివాడు సహితము గిరులు లంఘింపగలుగున ” న్న మాట ముమ్మాటికి వాస్తవము. గావుననే హైపర్వత బ్రమణసంకల్పము వ్యర్ధము కాలేదు. అక్కడ నుండి క్రమముగా పర్వతము నెక్క నారంభించితిని. ఆ పర్వతము గోడవలె ఏటవాలుగా ఉన్నతముగా నుండెను. దాని శిఖరమునుండి చూడ క్రిందనున్న కేలు వృక్షములు కూడ చిన్న పొదలవలె కాన్సింప జొచ్చెను. చెంతనున్న యొక గ్రామమునుండి వ్యాఘ్రరూపములుగల కుక్కలు కొన్ని మొరుగుచు పరుగులిడెను. ఎదుట భయంకరమైన యా యున్నత పర్వతము ! క్రింద నగాధమగు లోవ ! పైన నీభీకర శునకములు ! మిక్కిలి భయముతో నీసంకట పథమును దాటితిని.

అపర్ణాహ్నమున నొక ఖాళీగానుండిన డాక్ బుగ్లా వద్ద చేరి అచట ఒక దినము మకాము చేసితిమి. నాతో నెవడు వంటవాడు లేడు. బోయవాండ్రు “ మారొట్టె చాల తీయ్యు కానున్నద ” నిరి. బియ్యపు