పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియైదవ ప్రకరణము

181


.

బహుకష్టముతో ఆకొండ నెక్కగలిగితిని. కావున నేను వెళ్ళుట కెంత ఉత్సాహపడినను మార్గము దుర్గమము కదాయనీ వెళ్ళలేదు. వారి దేశములో స్త్రీల సంఖ్య అతి స్వల్పముగానుండెను. పాండవులవలె వారు అన్నదమ్ములందరు కలసి ఒక్క భార్యనే వివాహము చేసి కొందురు. ఆస్త్రీకి పుట్టిన సంతానము ఆయన్నదమ్ములందరిని “నాయన” అనియే పిలచుచుందురు.

ఆ రాత్రి పర్వతశిఖరమున నే ఉండి ప్రభాతమున నేనచటనుండి వెడలితిని. ఆనాడు బోయవాండ్రు మట్టమధ్యాహ్నమువరకు నడచి అచట సవారిదింపి, “ఇంకముందుకు సాగ లేము, బాట బాగుగ లేదు,” అనిరి.ఇంక చేయునదేమి? కొండమిగుల నేటవాలుగా నుండెను, కాలి బాటయైన లేదు. మార్గ మొంత మాత్రము సరిగా లేదు. పై నచూడ రాళ్ళు గుట్టలు గుట్టలుగా పడియుం డెను. కాని మార్గమంత కష్టముగా నున్నను వెనుకకు మాత్రము మరల లేకుంటిని. ఆ రాళ్ళమీది నుండి యే ఆ చెడిపోయిన మార్గముగుండనే మెల్ల మెల్లగా నెక్క నారంభించితిని. ఒకడున్ను నడ్డిదగ్గర పట్టుకొని వెనుక నుండి సహాయము చేసెను. ఈ విధముగా మూడుగంటలు నడచిన పిమ్మట ఆ చెడిపోయిన మార్గము నతిక్ర మించితిమి. శిఖరము పై కెక్కగా నొకగృహము కనబడెను, లోపల ఒక సోఫా' యుండెను. అచటికి వెళ్ళగానే దానిపై పరుంటిని. బోయవాండు గ్రామములోనికి పోయి నాకు గిన్నెడు. పాలు తెచ్చి యిచ్చిరి. కాని అధిక పరిశ్రమమువల్ల నాయాకలి తప్పిపోయి ఆపాలు తాగ లేక పోతిని. ఆసోఫా మీదనే రాత్రి అంతయు గడచిపోయెను. ఒక సారియైనను లేవ లేదు. ప్రాతః కాలమునకు కొంచము బలము వచ్చెను. బోయవాడ్రు మరియొక గిన్నెడు పాలు తెచ్చియిచ్చిరి. ఆపాలు తాగి ఆస్థానము నుండి బయలు దేరితిని. ఇంకను పై కెక్కి ఆదినము “నార్ఖండా” చేరితిని, ఇది అత్యున్నతమైన శిఖరము. అచ్చట శీతల మధికముగ నుండెను.