పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

మహర్షి దేవేంద్రనాధ ఠాగూర్ స్వీయచరిత్రము.

ముప్పదియైదవ ప్రకరణము



నేను సీమ్లాకు తిరిగివచ్చిన పిమ్మట నొకనాడు కిశోరితో,నేనెక వారము దినములలో ఇంకను ఉచ్ఛతర పర్వత బ్రమణమున కుత్తర దిక్కునకు పయనము చేసెదను. నీవు నాతోరావలయును. నాకొరకొక సవారియు, నీకొరకొక గుఱ్ఱమును సిద్ధము చేసియుంచుము” అంటిని. చిత్తము " అనికావలసిన ఏర్పాటుల గావించుటకు అతడు పోయెను. సీన్లూను వదలుటకు జ్యేష్ట బహుళ దశమి దినమును స్థిరపరచి కొంటిని. ఆనాడు పెందల కడనే లేచి బయలు దేరుటకు సిద్ధపడితిని. గుమ్మము వద్ద నాసవారి సిద్దముగ నుండెను. బోయివాండ్రందరు సిద్ధముగ నుండిరి. నీగుఱ్ఱమేది ? అని కిశోరి నడిగితిని. “ ఇదిగో ఇప్పుడే వచ్చు నిదుగో ఇప్పుడే వచ్చున” ని మార్గమువంక ఆతురతతో చూడ నారంభించెను. ఒకగంట గడచెను. కాని అప్పటికిని గుఱ్ఱము జాడ కనబలేదు. నాప్రయాణము నకు ఆలస్యము, ఆటంకము నేనింక సహింపలేక పోతిని.అధిక శీతలమునకు భయపడి కిశోరికి ఉత్తరమునకు వచ్చుట కిష్టము లేదని కని పెట్టితిని. " నీవు నాతో రాకుండినచో "నేనొంటరిగా పర్వత భ్రమణమునకు పోలేనని నీవూహించుచున్నావు కాబోలు. నీవు నాతో రానక్కర లేదు. నీ విక్కడనే యుండుము. నాతాళము చెవులను నాకిమ్ము ” అని తాళము చెవుల నాతని వద్దనుండి తీసికొని, సవారిలో కూర్చుండి, “ సవారి నెత్తుడ ' ని బోయవాండ్రతో చెప్పితిని, సవారి యెత్తబడెను. నా సామానులు కూలీలు తెచ్చుచుండిరి. విభ్రాంతుడై, స్తబ్దుడై కిశోరి నిలబడి యుండెను. నేను ఆనందముతోను, ఉత్సాహముతోను బజారుగుండా పోవుచు, నిటు నటు చూచుచు సిమ్లాను వదలితిని