పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

177

ముప్పది నాల్గవ ప్రకరణము,


లడిగితిని. “ నేడును మంచివార్తలేమియు లేవు. జలందరు నుండి విద్రో హులు నేడు రావచ్చును” అనెను. ఘోషువద్దను.. ఎన్నడును సద్వర్త మానమురాలేదు. అతడు ప్రతిదినమును ముఖము వ్రేల వేసికొని వచ్చుచుండు వాడు. ఈ రీతిగ అతి కష్టముతో - "నేనచట పదునొకండు దినములు గడపినిని. అటుపిమ్మట, సిమ్లా నిర్విఘ్నమై యున్నదనియు, ఇంకేమిఁయు భయము లేవనియు సమాచారము తెలిసెను. తిరిగి సీమ్లాను పోవుటకు ఏర్పాటులు కావింప నారంభించితిని. కూలీలకొరకు కబురుపంపగా ఎవ్వరును లేరని వింటిని. కలరా భయముతో వీరు పలా యితు లైరి. 'నేనొక గుఱ్ఱమును సంపాదించి దాని పై నెక్కి మధ్యా హ్నము బయలు దేరితిని. కొంత దూరము వచ్చిన పిమ్మట రాత్రి ఒక చోట మకాము చేసి మరునాడు తిరిగి గుర్ర మెక్కి బయలు దేరితిని. కిశోర నావద్ద లేడు. ఒక చెటైనను తుప్పయైనను లేని ఆపర్వతముల పై జ్యేష్ఠమాస రౌద్రోత్తాప మతితీక్లము గానుండెను. కొంచెము నీడకొర కెదురు చూచితిని, గాని నీడనిచ్చుటకు వృక్షమెక్కడ? పిపాసతో కంఠ మొండి పోవుచుండెను; కాని నాగుర్రము నోక క్షణము పట్టుకొనుట కొక మనిషి యైనను లేడు. ఈయవస్థ మధ్యాహ్య పర్యంతము పయనము చేసిన పిమ్మట నేనొక బంగాళావద్దకు చేరితిని.గుర్రమును కట్టి వేసి దానిలో విశ్రమిచుటకు పోతిని. నేను మంచితీర్థ మడుగుచుంటిని. దైవక్రమమున

నావలెనే పలాయిత యైన ఒక స్త్రీ అక్కడ నుండెను. ఆమె దుఃఖము

నుండుటచే నాయందు సానుభూతి చూపి నాకు కొంచెము వెన్నయు ఉడక బెట్టిన బంగాళాము ద్ంపలను, కొంచము జలమును పంపెను. వీని నారగించి నాక్షుత్పిపాసలను నివారణ చేసికొని తెప్పిరిల్లి తిని, సంధ్యా సమయమునకు సీన్లూ చేరితిని, గుమ్మము ముందు నిలబడి, కిశోరీ ఇక్కడనున్నాడా అని కేక లిగితిని. కిశోర్ వచ్చి తలుపు తెరచెను. డాక్సాహినుండి సిమ్లాకు జ్యేష్ఠ బహుళతదియ నాడు తిరిగి వచ్చితిని.