పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము


అచ్చట ఒక చక్రాకృతిగల కోట నిర్మాణము చేసిరి. దానిమధ్య పతాక మెగురుచుండెను. క్రింద ఒక సోల్జరు ఖడ్గము చేతబూని నిలబడి యుండెను. "నేను నెమ్మదిగా ఆ పెట్టెల గోడ నెక్కి లోపల ప్రవేశించి అతిభయముతో ఆసోల్జరు వద్దకు పోతిని. ఆకత్తి నాపై దూయునే మోయని భావించితిని; కానియతడు అతివిషణ్ణముఖముతో ఘర్కా లిట్లు వచ్చుచున్నారా ఏమి?” అని అడిగెను. " లేదు, వారింకను ఇచటకు రాలేదు, “అని ప్రత్యుత్తరమిచ్చి అందుండి వెడలివచ్చి ఒక చిన్న గుహను కాంచి తన్మధ్యమున, ఛాయలో కూర్చుంటిని. సంధ్యా కాల మున పర్వతము దిగి నాగదిలో నిద్రించితిని. ఆరాత్రి కొంచము వర్షము కురిసెను. ఆగది వాననుండి నన్ను కాపాడ లేకపోయెను. శిధిల మైయున్న ఆగది కప్పునుండి నీరు కారుచుండెను.

ఈ ప్రకారముగా, అరణ్యవాసములో రాతింబగళ్లు గడచి పోవుచుండెను. కాబూలు యుద్ధము నుండి తిరిగి వచ్చిన ఇద్దరు బంగాళీలు, బోసు, 'ఘోషు అనువారు ఇచట తపాలాకచేరిలో నుద్యోగము చేయు చుండిరి. వారునన్ను చూచుటకువచ్చిరి. బోసు, యుద్ధమునుండి కష్టములో ప్రాణములు దక్కించికొని వచ్చితిని. అపుడు నేను పలాయనమై వచ్చుచుండగా మార్గమున నొక శూన్యగృహము గాంచితిని; దానిలో ప్రవేశించి అటకపై దాగికొనియుంటిని. కాబూ లీలు నన్నచటగాంచి, కొంచ మించుమించుగా నాప్రాణములను తీసిరి * బహుకష్టముతో నెట్లో బయట పడితిని. ఇక్కడ మరల ఈవిపత్తు సంభవించినది” అనెను. నేనిక్కడ నున్నంత కాలము ఘోషు అను దినమును వచ్చి నా యోగ క్షేమము లారసి పోవుచుండు వాడు. ఒక నాడతనితో " " ఘోష్, ఈదినమున వార్తలేమి?” అని అడిగి తిని. నేడు విశేషము లేమియు మంచివి కావు. విద్రోహులు తపాల్సం చులను పట్టుకొని కాల్చి వేసిరి” అనెను. మరుసటిదినము తిరిగి వార్త