పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది నాల్గవ ప్రకరణము

173


. అచ్చటి దొరలు హే ప్రభువుపై విశేష కోపము చూప నారంభించిరి. “హే ప్రభు వెంత మాత్రమును తెలివిగ పని చేయలేదు. మన ధన మును, ప్రాణమును, మానమును, సర్వమును. విద్రోహులగు శత్రు వుల హస్తములలో నుంచినాడు. వారి వద్ద నట్టి నమ్రత చూపి ఆంగ్లేయ జాతికి కళంకము తెచ్చెను. ఆభారము మన చేతిలో నుంచినచో మనము వారిని తరిమివేసి యుందుము" అనిరి.


ఒక బంగాళీ వచ్చి నాతో, “మహాశయా, ఘూర్కాలు వారి అధికారముల నన్నిటిని వారు పొందినను వారికోపమును తగ్గించుట లేదు. వారు ఆంగ్లేయులను విస్తారముగ దూషణ చేయుచున్నారు” అని చెప్పెను. “వారికి నాయకుడు లేడు. వారు అధి కారి లేని యుద్ధభలులు, వారి యిష్ట మువచ్చినట్లు పేలనిమ్ము, త్వరలో సర్వమును చల్లారును.” అని నే నంటిని. కాని దొరలు భయకంపితులైరి. ఘూర్కాలు సిమ్లా నాక్ర మించుకొనిరి కావున, పలాయనము తప్ప ప్రాణరక్షణ మార్గ మన్యము లేదని నిరాశ చెంది ప్రాణముల దక్కించుకొనుటకు సిమ్లా నుండి పలా యితులగుటకు నిశ్చయించుకొనిరి. మట్టమధ్యాహ్న సమయమున అనేక మంది దొరలు, సవారి, గుఱ్ఱము, పరివారము ఏమియు లేక యే పర్వ తముకిందికి భయకంపితులై పరుగిడ నారంభించిరి. ఒకరినిగూర్చి యోచించుటకుగానీ ఒకరికి సహాయము చేయుటకుగాని ఎవరికిని అవకా శము లేదు. అందరును ఎవరి క్షేమమును గూర్చివారే ఆత్రము చెంది సంధ్యా సమయము లోపల సిమ్లా అంతయు జనశూన్యమై యుండెను. ఇంతవరకును మనుష్య సంకీర్ణమై కలకలలాడు చుండినసిమ్లా ఇప్పుడు నిశ్శబ్దమై యుండెను. సిమ్లా యొక్క విశాలా కాశమంతయు కేవలము కాకులమూకల యొక్క “కావు, శావు”లతో నిండి యుండెను . సిమ్లా మనుష్యశూన్యమై యుంచుటచే నేనును ఈ దినము వెడలి