పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్. స్వీయచరిత్రము.



ఈవర్తమానము తెలియగానే సిమ్లాలో కాపురమున్న బంగా ళీలు మహాభీత చేతస్కులై సపరివారముగా పలాయితులు కాదొడగిరి. అక్కడి ముసల్మానులు తమ రాజ్యమును తాము తిరిగి పొందవచ్చు నని భావింపసాగిరి. ఎక్కడినుండియో యొక ఆజాను బాహుడును, స్ఫురద్రూపియు పొడుగగు గెడ్డము గలిగినట్టియు యొక ఐరాన్ దేశ స్థుడు నావద్దకు వచ్చి నన్ను సంతోష పెట్టుట కిట్లనెను: “ఈఫరంగీ 'లింతవరకును, ముసల్మానులచే పంది మాంసము తినిపించిరి; హిందువు లచే గోమాం సమును తినిపించిరి. ఇపుడు వారి పని 'యేమగునో చూ తము” అనెను. ఒక బంగాళీ వచ్చి, “తమరు ఇంటివద్ద హాయిగ నుండిరే! ఈయుపద్రవములో నిక్కడి కేలవచ్చిరి? మేమింతవరకు నిట్టి యుప ద్రవ మెన్నడు చూచియుండ లేదు,” అనెను. " నేను ఒంటరిని, నామా టకేమి కాని యిక్కడ సపరివారముగా నున్న వారిని గూర్చి భయపడు చున్నాను. వారిదే మహావిపత్తు” అంటిని.


అచటి ఆంగ్లేయులు సిమ్లాను కాపాడుట కొరకు ఏకమై వారి స్త్రీలతో నొక యెత్తైన కొండ పై నెక్కి దాసిని నాలుగు వైపుల కాసిరి, వారు సిమ్లాను రక్షించున దేమి? వారచ్చట మద్య పానముతో మత్తులై, ఆమోదముతో కోలాహలము చేయుచు పగల్భము లాడనారం భించిరి. కాని సుధీరుడును, కార్యకుశలుడును అగు సిమ్లాకమిషనర్ హే ప్రభువు (Lord Hay) సిమ్లాను రక్షించెను. సిమ్లాకు ఘూర్కా సైన్యాగమన సూచక మగు ఫిరంగిశబ్దము వినబడినప్పుడు అతడు తన ప్రాణముల కై భయమును త్యజించి, మావటివాండ్లు లేని ప్రమత్త హస్తి యూధమువలెనున్న ఆ సైన్యదళ సమ్ముఖమున నిలచి తలమీది టోపీ నెత్తి సలామ్ చేయుచు నిలబడెను. నిలబడి, సౌమ్య తిని ఆశ్వాస వాక్యములతో వారిని శాంత పరచి, సిమ్లాకు వచ్చి, విశ్వస్తచిత్తముతో ఖజానా మొదలగువాని రక్షణభారము వారిపై నుంచెను. ఇందువ