పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

మహర్షి దేవేద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


పోక తప్పదు. ఘూర్కాలుమాకే యత్యాచారము చేయక పోయినను కొండ వాండ్రువచ్చి సమస్తమును దోచుకొని పోదురు. కాని ఆనాడు నాకు బోయవాండ్రెట్లు దొరుకుదురు? సవారివాండ్రు దొరకకుండినచో సీన్లూ నుండి కాలినడక నైనను పారిపోవలెనన్న భయము మాత్రము చెంద లేదు. ఈయనస్థలో నావద్దకు చింతనిప్పులవలె నెఱగనున్న కండ్లుగలిగి, పొడగరియైన ఒక నల్లని పురుషుడు నావద్దకువచ్చి, “కూలి 'వాండ్రు కావ లేనా”? అని అడిగెను. “ఔను, కావలెనంటిని. "ఎంద రు” అని అతడి గెను. ఇరువది మంది కావలెనంటిని. “సరే, తీసికొని వచ్చెదను, నాకుమాత్రము బహుమతి యివ్వవలెను,” అనుచు అతను వెడలిపోయెను. ఈలోగా నేనొక డోలీ కుదిర్చికొంటిని. రాత్రి భోజనా సంతరమున ఉద్విగ్న చిత్తముతో శయనించితిని. రాత్రిరెండు జాము లయ్యెను. “తలుపు! తలుపు! అని కేకలిచుచు నెవరో తలుపు తట్టిరి విశేష కోలాహలము కాజొచ్చెను. నాహృదయము కంపించెను. విశేష భయమయ్యెను. ఇప్పుడింక ఘూర్కాల హస్తములో మరణము తప్ప దనుకొంటిని. భయముచే వణకుచు తలుపు తెరచితిని, చూడగా నాపొడవైన మనుష్యుడు 20 మంది కూలీలతో వచ్చి గోల చేయుచుం డెను. ఇక నా ప్రాణముల గూర్చి భయము పోయెను. వారు నాకురక్షకు లుగా రాత్రియంతయు నాగదిలో నిద్రించిరి. ఈశ్వరునకు నాయందున్న ఆపారకరుణ ఇందులో పూర్తిగా విశదమయ్యెను.


ప్రభాతమయ్యెను. సిమ్లాను వదలుటకు సంసిద్ధుడ నైతిని, కూలి ముందుగా యిచ్చినగాని కూలీలు బయలు దేరమనిరి. వారికి సొమ్ము నిచ్చుటకు ' కిశోరీ, కిశోరీ' యని పిలచితిని. కాని కిశోరీ యెక్కడ? చిల్ల రఖర్చుకై సొమ్ము అతని వద్దనుండెను. ఖజానాపెట్టె నావద్దనుం డెను. కాని అంత సొమ్ము కూలివాండ్రకు కనబడనీయకూడదని బావిం చితిని. కిశోరి లేడు. సొమ్మివ్వనిదే కూలీలు కదలరు. నేనప్పుడు వారి