పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది మూడవ ప్రకరణము.

169



ఎత్తునుండి ఆ జలధార పడ నారంభించెను. ఐదునిమిషము లక్కడ నిలచి యుంటిని.ఆ హిమజలకణములు ప్రతిరోమరంద్రము భేదించికొని నాశరీరములోనికి ప్రవేశింప నారంభించెను. నేను బయటకు వచ్చితిని. కానీ నాకది మిక్కిలి ఆమోదముగా నుండుటచే మరల దానిమధ్య ప్రవేశించితిని. ఈరూపముగా ప్రపాతము యొక్క ధారలో స్నాన మాచరించితిని. మేమా పర్వతవనమునం దెంతయో ఆనందముతో వనభోజనము చేసికొని సంధ్యా సనుయమునకు బసకు తిరిగివచ్చితిమి. అదివరకు నావామచక్షువేదో బాధగా నుండెను. మరునాటి ప్రాతఃకాల మున కది యెర్రపడి వాచి యుండెను. ఉపవాసముచే చక్షురోగము నివారణ చేసితిని. జ్యేష్ఠ తదియనాడు రోగ శాంతి అయిన పిమ్మట ఆరోగ్యముచే శరీరము మనస్సు ప్రసన్న మయ్యెను. ద్వారములు తెరచి యున్న గదులలో నిటునటు నడచుచు ఈసిమ్లా గృహములో నాజీవ నమంతయు సుఖముగా గడపవచ్చునుగదా యని ఆలోచించు చుంటిని. ఇట్టి సమయములో నాగదికింది. వీధిలో కొందరు జనులు పరుగెత్తు చుండిరి. నేనది చూచి, “ఏమిసంగతి, ఎందుకట్లు పరుగెత్తుచున్నారు?” అనిజిజ్ఞ' సచేసితిని. కాని వారేమియు ప్రత్యుత్తరమీయక చెయ్యి ఊపి నన్ను కూడ పరుగిడమనిరి. ఎందుకు పరుగిడుటయని యడిగితిని. కాని నాకు ప్రత్యుత్తరమిచ్చుట కెవ్వరును లేక పోయిరి. ఎవరిప్రాణము వారు దక్కించు కొనవలెనని తొందర పడుచుండిరి.'

వీరి భావము కొంచమైనను తెలిసికొనజాలక వర్తమానము తెలిసికొనుటకు ప్యారీ బాబు వద్దకు పోతిని. అతడు గోడమీద సున్న కపాలమున పెద్ద బొట్టు పెట్టుకొని 'మెడలోనుండి యజ్ఞోపవీతముతోము పైకి తనకోటుమీద ధరించుచుండెను. అతని నేత్రములు రక్త వర్ణముగ నుండెను. ముఖము మలినముగ నుండెను. నన్ను చూచిన వెంటనే, “ఘూర్కాలకు బ్రాహ్మణులన్న గౌరవము,” అనెను. “ఏమి