పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


అనెను. నేనతనితో " మెట్టదిగి దానిని చూచుటకుపోతిని. దిగుచు దిగుచు సచ్చటచ్చట మనుష్య వాసములు, సస్య క్షేత్రములు సంకీర్ణము లై యుం డుట గాంచితిని అచ్చటచ్చట పశువులు మేయుచుండెను. అచ్చటచ్చట నాకొండల యందలి స్త్రీలు ధాన్యము దంపుచుండిరి. ఇదంతయు చూచి మిగుల ఆశ్చర్యము నొందితిని. ఇక్కడకూడ మైదానములందు వలెనే గ్రామములు క్షేత్రములు నున్నవని నేనిప్పుడే తెలిసికొంటిని?. ఇట్లు చూచుచు చూచుచు మెట్టయొక్క నిమ్న తమస్థానము చేరితిమి. సవారీలు ఇక ముందుకు "వెళ్ళుటకు దారి లేకుండుటచే అచ్చటనే యుం చితిమి. మేము కొండలాటీలు చేత పట్టుకొని మెల్ల మెల్లగ నాజలప్ర పాతము చెంత శిలాతలము చేరితిమి, 300 మూరల ఎత్తునుండి జలధార పడుచుండెను. శిలల ప్రతీఘాతముచే జలము ఫేనరాసుల వెదజల్లుచుండెను. ప్రవాహము మహా వేగముతో కిందికి పరుగులిడు చుండెను. 'నేనొక శిలాతలమున కూర్చుండి ఈజలక్రీడను చూడ నారంభించితిని. పర్వతావరోహణమువల్ల కలిగిన పరిశ్రమచే ఘర్మోక్తమైయున్న నాశరీరమును ఈజలప్ర పాత శీతలకణములు స్పృశింపగ నే నాచక్షువులను అంధ కారము కమ్ముకొనెను. నేను అచేతనుడనై శిలాతలమున పడితిని. ఒక క్షణమైన పిమ్మట నాకు చైతన్యము వచ్చినది. చక్షువులను తెరచితిని, నామిత్రుడు ప్యారీ మోహనుని ముఖము శుష్కమైయుం డెను. అత డెంతయు విషజ్ఞుడై కర్తవ్య మెరుంగక నాముఖమువంక తేరి పారి చూచుచుండెను. వెంటనే ఆయవస్థను తెలిసి కొనియాతనికి ధైర్యము కలుగ చేయుటకై నవ్వితిని. ఈవిధముగా జల ప్రపాతము చూచిన పిమ్మట నాబసకు తిరిగి వచ్చి తిమి.

ఆమరుసటి ఆదివారమునాడు తిరిగి కొందరము కలసి వనభోజునము చేయుట కై ఆజల ప్రపాతముదరికి బయలు వెడలితిమి. నేను పోయి అజలప్రపాతము మధ్య ప్రవేశించితిని. నామస్తకము పై 300 మూరల