పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


సంగతి?” అని నేనడిగితిని. “ఘూర్కా సైన్యము సిమ్లాను కొల్లగొనుటకు వచ్చుచున్నారు. కొండదిగి పోవ నిశ్చయించుకొంటిని.” అని యతడు చెప్పెను. అయినచో నేనును నీతో వచ్చెదనంటిని, ఈమాట విని అతడు ముఖము మరింత చిట్లించుకొనెను. ఒంటరిగా పర్వతములలో దాగుకొనవలెనని అతని కోరిక. మేమిద్దరము కలసి పోయినచో కొండ వారికి కండ్లు కుట్టి మా ప్రాణములకు హాని సంభవింపవచ్చును. అతని భావము గ్రహించి, "లేదు, లేదు, నేను కొండదిగనులే ” అంటిని.

నాబసకు తిరిగివచ్చి చూడగా తలుపు తాళము వేసియుండెను. నేను గృహములోనికి ప్రవేశించుటకు వీలు లేక వీధిలో సంచరింప నారంభించితిని. కొంచెము సేపునకు కీశోరీ నాధుడు వచ్చి, “రూపాయ లసంచి పొయ్యి వద్ద భూమిలో పాతి పెట్టి దానిపై కట్టెలమోపు పెట్టి తిని. నౌఖరును యింటిలో నుంచి తాళము వేసితిని. ఘూర్కాలు ఘూర్కానుచూచి ఏమియు హాని చేయ్యరు” అని చెప్పెను. సరే కాని నీ ప్రాణము కాపాడుకొనుట కేమి చేయదలంచితివి?” అని నేనడిగితిని. "ఘూర్కాలు వచ్చినచో రోడ్డు పక్కనున్న యీగోతిలో ప్రవేశించి దాగికొనెదను. నన్నెవరు చూడగలరు ? ” అని అతడు బదులు చెప్పెను.


ఘర్కాలు వాస్తవమువముగా వచ్చుచున్నా రేమో చూచితిని. కానీ నా కేమియు కనబడ లేదు. కాని ఘార్కాలు సిమ్లామీదికి దాడి వెడలివచ్చినచో అందరకు తెలియుటకు ఫిరంగులు పేల్చబడునని ప్రకటన చేయబడెను. క్షణమైన పిమ్మట నే యొక భయానక మైన ఫిరంగి మోత వినబడెను. నేనిక నీశ్వరునిపై భారము వైచి వీధిలో పచారు చేయ నారంభించితిని. రాత్రి యయ్యెను, కాని ఏమి యుపద్రవమును సంభవింప లేదు. నేను గృహములోనికి పోయి నిర్భయముగా శయనిం