పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము.

165



బియ్యముంచుకొని వానికి పెట్టుటకు పోవువాడను. కాని అవి భయ ముతో “ కే, 'కా,' యని ఆర్చుచు ఎక్కడికో ఎగిరిపోవుచుండెడివి. ఒక నాడెవరోనాతో, “ అట్లు చేయకుము. అవిచాల చెడ్డవి. పొడిచినచో అవి కండ్లే పొడుచును” అనివారించెను. ఒక నాడు మేఘములు కమ్ము కొనెను. అప్పుడా మయూరములు పీఛములను తలపైకి విప్పి నృత్య ము చేయసాగెను. ఎంతటి ఆశ్చర్య దృశ్యము ! నాకు వీణవాయించు టచేత నైనచో నానియాటకు తగినపాటవాయించి యుందును. మేఘ ములు కనబడగనే మయూరములు ఆనందనృత్యము చేయు చుండునని వ్రాసిన కవీశ్వరుల మాట వాస్తవము. " నృత్యంతి శిఖినోముదా, ఇది ఎంతమాత్రము వారి భావకల్పన కాదు.

ఫాల్గుణ మాసము గడచి పోయెను. మధుమధుర చైత్ర మాస సమాగమములో వసంత ద్వారము లొక్క సారిగ నుద్ఘాటితము లయ్యెను. మలయానిల మీతరుణము కనిపెట్టి ఆంరముకుళ సౌరభ మును, సద్య ప్రస్ఫుటిత నారింజ సౌరభములతో మిశ్రమముగావించి, యొక్క కోమలసుగంధ తరంగముచే నలుదిక్కుల నామోదితము గావించు చుండెను. ఇదియంతయు నాకరుణామయుని నిశ్వాసము. చైత్రమాస సంక్రాంతి నాడు నాగృహము :వద్దనున్న జలాశయమునందు ఎచటినుండియో అప్సరసలు వచ్చి రాజహంసలవలె ఉల్లాసకోలాహల ముతో జలక్రీడలాడు చుండిరి. ఈవిధముగా కౌలశ్రోత మతిసుఖ ముగా, నతీ వేగముగా ప్రవహించి పోవుచుండెను. వైశాఖమాస మారంభమయ్యెను. ఇంక సూర్యతాపము ననుభవింప సాగితిని. మేడమీదినుండి ఒక అంతస్థు కిందికి దిగితిని. కాని రెండుదినములలో తాప మచటికికూడ ప్రవేశించెను. ఇంటి యజమానితో " నేనింక నిచటనుండ జాలను. క్రమముగ నుత్తాపమధికమగుచున్నది. ఇక్కడనుండి నేను వెళ్లె ధను.” అంటిని. అతడు, “భూమికింద నొకగదియున్నది. గీష్మకాల