పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

మహర్షి దేమేద్రనాధ రాకూర్ స్వీయచరిత్రము,



అనేకులు శీఖులు నాబసకు వచ్చుచుండిరి. వారి వద్దనుండి వారీధర్మశిక్షయు, వారిగురుముఖి భాషయు నేర్చికొంటిని, వారిలో అంతగా ధర్మోత్సాహము నాకు కనబడ లేదు. ఉత్సాహపూరితుడగు ఒక శీఖు నాతో, “అమృతరసమును రుచిచూడక అయ్యో! అయ్యో! యని దుఃఖించుచు మృతించిన లాభమేమి ? ” అనెను. ఏన్చుటవల్ల లాభముండక పోదని నేనతనికి ప్రత్యుత్తరము చెప్పితిని.

అమృత్సరములో రామ్ బాగాన్ " సమీపమున నాకు దొరకిన బస అంతగా సౌఖ్యముగా లేదు. ఇల్లుపాడుపడి యుండెను. తోట అంతయు వినాశదశలో నుండెను. చెట్లల్లి బిల్లిగా పెరిగి అరణ్య ము వలెనుండెను. కాని నానవీనోత్సాహమునకును, నూతన దృష్టికిని అన్నియును నూతనముగను, అన్నియును సుందరముగను కాన్పించెను. అరుణోదయమున, ప్రభాత సమయమున నేనుద్యానవనములో విహ రించునపుడు, గసగసా చెట్ల యొక్క శ్వేత, పీత, లోహిత పుష్పము లన్నియు శిశీరజలాశ్రుపాతము గా వించు చుండి నప్పుడు, రజత కాంచనచ్ఛాయలతో వెలుంగు తృణపుష్పరాశీ ఉద్యాన భూములందు జరీ " మచ్ నద్ " పరచినపుడు, స్వర్గ సౌఖ్యము గొల్పు మలయమారుతములు ఉద్యానవనమున మకరందరసముల 'వెదజల్లునపుడు, దూర దూరమునుండి ఆ పంజాబీల సుమధుర సంగీత స్వరములు ద్యానవనమున అల్లనల్లన ప్రతిధ్వనించి నపుడు, నాకా యుద్యానవనమంతయు నొక గంధర్వ పురమువలె తోచుచుండెను. అప్పుడప్పుడు మయూరీ మయూరములు వనాంతరము నుండి వచ్చి నా గృహోపరిభాగమున వరుసగా కూర్చుండెడివి. వాని చిత్ర విచిత వపు దీర్ఘ పుచ్ఛములు సూర్యకిరణములవల్ల ప్రకాశితములై నేలకు వేలాడుచుండును. అప్పుడప్పుడు పైనుండిదిగి ఉద్యానవనములో మేయుచుండును. నేను వానియందు ప్రేమతో చేతిలో కొంచము