పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

మహర్షి దేమే ద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,


, ములో నందుండుటకు మిక్కిలి చక్కగనుండున,”ని నాతో చెప్పెను. నాకింతవరకు భూమి అడుగున ఇంకొకగదియున్నట్లు తెలియదు. నన్న క్కడ కతడు తీసికొని పోయెను. అక్కడ సరిగా భూమిపైనున్న గది వలెనే యొక గదియుండెను. ఒక వైపునుండి వాయువు వెలుతురు వచ్చు చుండెను. ఆగది మిక్కిలి చల్లగనే యుండెను. కాని నేనక్కడ నుం డుటకిష్ట పడ లేదు. భూమికింద మొకగదిలో ఖయిదీ వలెనేనుండజాలను. స్వేచ్ఛయౌ గాలి, విశాలమౌ గృహము నాకు కావలెను. ఒకశీఖు నాతో "ఆ ట్లైన సిమ్లా కొండలకు పొండు. అది మిగుల చల్లని ప్రదే శము” అనెను. అది అనుకూలముగా నుండునని భావించి 1857 సం||రం వైశాఖ శుద్ధ నవమినాడు సిమ్లా అభిముఖుడనై ప్రయాణమైతిని.


మూడు రోజులు ప్రయాణము చేసిన పిమ్మట పాంఔర్ (Panjaur) వదలి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు (ఏప్రిల్ ఆఖరు రోజులు) కాల్కాకనుమ (kalka) వద్ద దిగితిని. ముందు వైపున పర్వతములు దారి కడ్డుగనుండెను. నాముందు వాని చిత్ర మనోహర దృశ్యము వ్యాపించియుండెను. ' రేపటిదినము వీనిపై కెక్కెదను, పృధివిని వదలి స్వర్గము యొక్క ప్రధమసోపాన మారోహణ చేసెదను' అని ఆనందము తో భావింప నారంభించితిని. ఈ సంతోష భావముతో నారాత్రియం తయు గడపి హాయిగ నిదురించి, ప్రయాణ ఖేదము నపనయించితిని.

ముప్పది మూడవ ప్రకరణము

. వైశాఖమాసము సగము దాటిపోయెను. బహుళ పాడ్యమి ప్రాతః కాలమున నొక సవారీ తీసికొని దారులు చుట్టుకొనుచు పర్వతము నెక్క నారంభించితిని. ఎంత ఉచ్ఛపర్వతము నెక్కుచుంటినో మన స్పంత ఔన్నత్యము పొందసాగెను. కొంత మేర ఎక్కిన పిమ్మట