పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది మూడవ ప్రకరణ

167


నన్ను మరల కిందికి దింపుచుండిరి. క్రమముగా నింకను ఎత్తున కెక్క వలెనని యున్న దే నన్ను కింది 'కెందుకు దింపుచున్నారను కొంటిని. జోయివాండ్రు పూర్తిగా కిందికి దింపి వేసిరి. నన్నొక నదివద్ద నాపిరి. ముందింకను ఒక ఉచ్ఛతర పర్వతముండెను. దాని పాద ప్రాంతముననే యీక్షుద్ర నది. అప్పటికి రెండుజాములయ్యెను. రౌద్రముచే నిమ్న పర్వతముత్త ప్తమై నన్ను మిక్కిలి పీడించెను. సమభూమి యొక్క ఉత్తా పము భరింపవచ్చును కాని నాకీయుత్తాపము దుర్భరమయ్యెను. ఇచ్చ ట నొక చిల్లర దుకాణముండెను. దానిలో అటుకులమ్మబడుచుండెను. ఆయటుకులీయెండ 'వేడిమికి వేగినట్లు నాకు తోచెను. ఈనదీతీరము ననే మేము వంటచేసికొని భుజించితిమి. మేము నది దాటి సమ్ముఖము సందున్న పర్వతము నెక్క నారంభించి యొక శీతల స్థానము చేరితిమి.


హరిపురమను నొకయూరిలో నారాత్రి గడపితిమి. మరునాడు ప్రయాణము నారంభించి మధ్యాహ్న 'మొక వృక్షతలమున నాహారము గొని సంధ్యా సమయమునకు సిమ్లా చేరితిమి. నాపాలకీ బజారులో నుండెను. దుకాణదార్లు నావంక తేరిపారి చూచుచుండిరి. నేను పాలకీ దిగి దుకాణములు, వానిలోనున్న సరకులు చూచుచుంటిని. నా స్నేహితుడు కిశోరీ నాధభటర్జీ గృహానుసంధానమునకు వెళ్ళి ఆ బజారు లోనే యొక బస స్థిర పరచి శీఘ్రముగా సన్నక్కడికి కొనిపోయెను. అక్కడ నింకొక సంవత్సరము గడపితిమి.


అనేకులు బంగాళీ లచట నుద్యోగములలో నుండిరి. వానిలో చాలమంది నన్ను చూచుటకు వచ్చుచుండిరి. ప్యారీ మోహన్ బెనర్జీ ప్రత్యహము నా యోగ క్షేమములు తెలిసికొనుటకు వచ్చుచుండెను. అతడచట నొక ఇంగ్లీషుషాపులో నుద్యోగిగా నుండెను. ఒక నాడతడు నాతో, “ఇక్కడ సుందరమైన ఒక గొప్ప జలప్రపాతమున్నది. మీరు చూడ నిచ్చగింతు రేని మిమ్ములను తోడ్కొని పోయి చూపగలను”