పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము

155


. లో పాడుకొంప యొకటి ఉండుట చూచితిని. అచ్చట ఒక నూతివద్ద కొందరు సన్యాసులు కూర్చుండి జల్పన చేయుచుండిరి. ఈ యింటిలో వీరు వారు అనక ఎవరైన నివసింపవచ్చునని తోచినది. ఇట్లు భావించి నాసామానుతో అందులో ప్రవేశించితిని మరునాడు కాశీలో సుప్రసిద్ధుడగు 'రాజేంద్రమిత్ర కుమారుడు గురుదాసమిత్ర, నన్ను చూచుటకు వచ్చెను. నేనిచటకువచ్చిన సంగతి ఎట్ల తనికి తెలిసెనా యని ఆశ్చర్య పడితిని. నేను త్వరగా లేచి ఆతని నాదరించి చెంత కూర్చుండ బెట్టితిని. “ఈ మాయింటికి వచ్చి మమ్ములను మిక్కిలి గౌర వించితిరి.ఈయింటికీ తలుపులు లేవు, పర్గాలు లేవు, ఆవరణ లేదు. రాత్రులందు శీతల మమితముగా నుండును.రాత్రి మీరెంత కష్టముతో గడపియుండిరో తెలియదు. మీరిచ్చటకు వచ్చుట మాకు ముందు తెలిసియుండినచో సర్వము సిద్ధము చేసియుందుము,” అని అతడనెను. ఆత డెంతయో మర్యాద చూపి, నన్ను సత్కరించి ఆస్థానమును నివాస యోగ్యముగా చేసెదనని పట్టు పట్టెను. నేను కాశీలో పది దినము లుంటిని. బహు సౌఖ్యముగా నుంటిని.

మార్గశిర బహుళ విదియనాడు గుర్రపు బండిలో, కాశీ నుండి బయలు వెడలితిని. నా సేవకుల నందరిని ఇంటికి పంపి వేసి వారిలో నిద్దరిని మాత్రము బండిలో నేక్కించుకొంటిని —-కిశోర్నాధ ఛటర్జీ యొకడు, కృష్ణ నగరమునకు చెందిన యొక గొల్ల యొకడు. మరునాటి సాయంకాలము అలహా బాదువద్ద దక్షిణతీరము చేరగనే 'తెల్ల వారుజామున నాకు నౌక దొరక దేమోయను భయముచే నీబండి నప్పుడే రేవు పడవ మీద వేయించితిని. నేనా పడవమీద బండిలోనే పరుండి ఆరాత్రినిదించితిని. మరునాటి ప్రాతః కాలమున సావకాశముగా ఆ రేవు పడవ'బయలు దేరి రెండుజాముల వరకు ఆవలి మెడ్డు చేరెను. కోట ప్రాంతమున యిసుక బయలులో చిన్న పతాకము లనేకము లెగురుచుండెను.