పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

మహర్షి దేవేంద్రసాధకాకూర్ స్వీయచరిత్రము,


మేజిస్ట్రీటు యొక్క యాజ్ఞననుసరించి దీనికీ యడ్డు కట్టబడెను”, అని చెప్పిరి. దానిని చూచిన పిమ్మట తిరిగి యీమూడు కోసులు నడచి క్షుదితుడనై పిపాసితుడనై , పరిశ్రాంతుడనై , పడవకు తిరిగివచ్చితిని,

తర్వాత ఫతూయా (Fatua) విస్తీర్ణ గంగా మధ్యస్థానము గుండ ప్రయాణము చేయుచున్న సమయమున ఒక గొప్ప తుపాను బయలు దేరెను. తొందరగా పడవ నొడ్డుకు పట్టిరి, కాని ఒడ్డు చేరినను తుపానుధూకుడుచే పడవ గట్టుకు కొట్టుకొనుచుండెను. పడవ పగిలి పోవుటకు సిద్ధముగా నున్న దనియు రక్షించుట కసాధ్యమనియు తెలిసి కొని దోళాయమానమగు ఆ నౌకను వీడి యొడ్డున నిలబడి తిని, నేను గట్టి నేలమీద నే నిలబడియున్న ప్పటికి తుపానుమాత్రము నామ సస్సు సౌందోళ పెట్టుచు నేయుం డెను. ఇసుక వచ్చి నా శరీరమును బాణ ములవలె గుచ్చుచుండెను. ఒక మోటదుప్పటి చుట్టుకొని ఒడ్డున నిల బడి గంగానది యొక్క ఆ ప్రమత్త భీషణాకృతియందు ఆ “మహాద్భ యంపజామద్యుతం” అని వర్ణింపబడు ఆ “పరమేశ్వరుని మహిమ నను భవింపనారంభించితిని. మా వెనుక ఆహార సామగ్రులను తీసికొనివచ్చు చున్న చిన్న పడవ గంగా గర్భమున మునిగిపోయెను. పిమ్మట మేము పొట్నా చేరి నూతన ఆహార సామగ్రులు కొంటిమి. అక్కడ గంగా స్రోత మత్యంతప్రబలము. పడవ ఇంక కదల లేకపోయెను. ఈ దుర్ఘ యస్రోతము యొక్క ప్రతికూలముతో మార్గశిర శుద్ధ షష్టినాడు కాశీ చేరితిమి.

మొత్తము కలకత్తానుండి కాశీ చేరుట కొకటిన్నర మాసములు పట్టెను. ప్రాతః కాలముననే ఆపడవలోని సమస్త సామగ్రిని తీసి కొని యెక్కడకు పోదునా, ఎక్కడ బసదొరుకునా యని వెదకుకొను చు 'సిక్రోలు' * [1]వైపునకు పోతిని. కొంత దూరము పోయి ఒక తోట


  1. పాశ్చాత్యులు వసించు ప్రాంతము.