పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

మహర్షి జయేంద్ర నాధశాకూర్ స్వీయచరిత్రము,

156


ఈధ్వజములు యాత్రికుల పితృదేవతలుండు లోకమున సమున్నతములై యున్నవని చెప్పి పండాలు అర్ధ సంగ్రహము కావించు చుందురు. ఇదే పవిత్ర ప్రయోగ తీర్థము. ఇది సుప్రసిద్ధ వేణీఘట్టము. ఈఘట్ట మున ప్రజలు తలలు గొరిగించుకొని, పితృదేవతలకు శ్రాద్ధములుంచి తర్పణములు,దానములు సమర్పించుచుందురు. మాపడవ ఒడ్డు చేరగానే అనేకమంది పండాలు పడవ నెక్కి ఆక్రమించుకొనిరి. ఒక పండావచ్చి “ఇక్కడ స్నాసముచేసి క్షౌరముచేయిచు కొనుమ”ని చెప్పి నన్నులాగుట కారంభించెను. 'నేను యాత్రకు రాలేదనియు క్షౌరము చేయిం చుకొనననియు చెప్పితిని. మరి యొక డు “యాత్రికుడవైన నేమి, కాక పోయిన నేమి, నాకు మాత్రము కొంత డబ్బియ్యమ”ని అడిగెను. “నేనే మియు నివ్వను, నీకు శరీర కష్టముచే జీవనము చేయుటకు తగిన శక్తి యున్నది. పరిశ్రమచేసి తిండి తినుము,” అని నేను ప్రత్యుత్త రమిచ్చి తిని. ఆతడు హిందీలో, “నీవు నా కేమైన యిచ్చి తీరవలయును, ఇవ్వ నిదే దిగనివ్వను” అనెను. నేనా భాషలో నే “ నేను నీకు దమ్మిడీ ఇవ్వ ను. నావద్దనుండి ఎట్లు తీసుకొనగలవో చూతము,” అంటిని, ఇదివిని ఆతడు పడవమీదినుండి భూమిమీదికి దిగి, పడవ తాడు పట్టుకొని తక్కినవారితో తానును కష్టపడి పడవను ఒడ్డుకు లాగజొచ్చెను. కొంత సేపు లాగినపిమ్మట నావద్దకు పరుగెత్తికొని వచ్చి "ఇప్పుడు కొంత పని చేసితినిగదా, నా కేమైన నిమ్ము ” అనెను. నేను మాట బాగున్నద"ని నవ్వి కొంతడబ్బిచ్చితిని.'


కష్టము మీద గంగ యొక్క పశ్చిమ పారమున రేవు చేరునప్ప టికి రెండుజాములు దాటెను. తరువాత రెండు కోసులు వెళ్ళిన పిమ్మట ఒక బంగాళాను చూచి అచట విశ్రమించితిమి. పిమ్మట అలహాబాదు విడిచి మార్గశిర బహుళ సప్తమినాడు ఆగ్రా చేరితిని. నాగుఱ్ఱపుబండి రాత్రింబగళ్లు పయనము చేయుచుండెను. మధ్యాహ్న సమయమున