పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదీయ"కటవ ప్రకరణము.


నేను 'వేచియుండిన ఆశ్వయుజమాస మిప్పటికి వచ్చెను. కాశీ పర్యంతము పోవుటకు నూరురూపాయల కొక పడవ నద్దెకుతీసికొంటిని. 1856 వ సంవత్సర ఆశ్వయుజ బహుళచతుర్ధి, 11 గంటల సమయమున గంగానది పోటు పొడవనారంభించెను. నామనసులోకూడ నూతనో త్సాహ తరంగము లెగయజొచ్చెను. నేను వెళ్ళి ఆ నౌకలో ప్రవేశం చితిని. లంగరు తీసిరి. పడవ బయలు దేరినది. నేనీశ్వరునివంక చూచి యిట్లంటిని; “మేమిప్పుడు నౌకలో కూర్చున్నారము. హే! అనుకూల మారుతమా! వీవనారంభించుము. బహుశః మరల మేమాదర్శనీయ మూర్తిని, మాపరమమితుని చూడగల్గుదుమేమో !? .*[1]

ఆశ్వయుజ ప్రతికూల గంగాప్రవాహము నందు పోవుచు నవద్వీ పము చేరుటకు వారముదినములు పట్టెను. గంగలో ఒక యిసుక తిప్పకు పడవను కట్టి యారాత్రి కాలక్షేపము చేసితిమి, నలువంకల గంగ, మధ్య సీద్వీము. తీవ్ర వాయువుల చేతను, మహావృష్టి పాతము చేతను అచటనుండి రెండుమూడు దినములవరకు కదల లేకపోతిమి. కార్తీక బహుళ పాడ్యమినాడు మాంగీర్ (Monglyr) చేరితిమి. తెల్ల వారుజామున నాలుగుగంటలకు లేచి అక్కడనుండి సీతకుండమును చూచుటకు "వెళ్లి తిని. నౌక వద్దనుండి మూడుకోసులు నడచిన పిమ్మట సూర్యోదయమున కచట చేరితిమి. ఆకుండములోని జలము చేయి పట్టజాలనంత వేడిగా నుండెను. దానికి నాలుగుప్రక్కలను అడ్డు కట్ట బడియుండెను. దీనికి అడ్డెందుకు కట్టిరని జిజ్ఞాసచేయగా నక్కడివారు, “యాతికు లప్పుడప్పుడు దీనిలో పై నుండి దూకుచుందురు, కావున


  • కష్టీని శిస్త్గా గానేం ఐబాద్ షర్త్ బర్హీజ్ బాషల్కెబాజ్ మబీ సేందీదార్ ఆష్ నారాః"