పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

మహర్షి దేవేంద్రనాధకాకూర్ స్వీయచరిత్రము


. నుం డెడిది. కాని నేనే స్వయంపర మేశ్వడను అనుకొనుట బహు అనర్ధ దాయక విషయము. అట్టి అభిమానముగల జిహ్వను కోసి వేయదగును.సహస్రములగు ప్రాపంచిక పాశములతో కట్టబడి, జరాశోక పాపతాపములంచు మునిగియుండి తాను నిత్యముక్త స్వభావంతుకననియూహీంచుటకన్న ఆశ్చర్యమింకేమి యుండగలదు! అద్వైతమును బోధించి శంకరాచార్యులు భారతవర్షము యొక్క మస్తకములు విఘార్ణితము గావించెను. అతడుపదేశించిన మతము ననుసరించి సన్యాసులు, గృహస్థులుకూడ “సోహం”.నేనే ఆఆపర మేశ్వడను"-అను ప్రలాప వాక్యము నుచ్చరించుచుందురు.

ఇరువది తొమ్మిదవ ప్రకరణము.

1858 వ సంవర్సర పుష్య బహుళ చతుర్దశినాడు బ్రాహ్మస మాజ సాధారణసభ యొకటి జరిగెను. ఈ సభకు శ్రీయుత రామనాధరాకూర్ అలొ సనాధిపత్యము వహించెను. ఆ సమయమున బ్రాహ్మసమాజమున రెండు 'ట్రస్టీ' పదవులు కాళీగా నుండెను. ఈపదవులలో టాస్టీలను నియమించుటయే యీ సభోద్దేశము 'ట్రస్టు'పత్రములోని నియమానుసారముగా ప్రసన్నకుమార ఠాకూర్ కుమాత్రము ట్రస్టీలను నియమించు హక్కు కలదు. అతని యిచ్ఛానుసారముగ సభాప్రారంభమున సర్వసమ్మతముగా సభాపతిమహాశయుడు నన్ను, రామప్రసాదరాయ్ ని ఆపదవులందు నియమిం చెను.


1848 సంవత్సరములో 'బ్రాహ్మధర్మబీజము వ్రాసి ఒక పెట్టేలో పెట్టి తాళము వేసితిని. ఒక సంవత్సరానంతరము దానిని పెట్టెలో నుండి బయటకు తీసితిని. ఆ బీజము సారగర్భితముగా నుండుట చూచి