పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదితోమ్మిదన ప్రకరణము.

147


ఆశ్చర్యపడితిని. ద్వితీయ మంత్రములో అనంతం", "విచిత్ర శ క్తిమత్ " అను పదములకు మారుగ "అనంతం”, “సర్వశక్తిమత్ ” అను పదము లుకూర్చితిని. తృతీయమంతములో "సుఖం" అనుమాటకు బదులు 'శుభం” అనుమాట వ్రాసితిని. ద్వితీయ మంత్రము చివర “ధృవం, పరిపూర్ణం, అప్రతిమం” అను శబ్దముల చేర్చితిని. 1851 వ సంవత్సర మార్గశిరమాసపు 'తత్వబోధినీ' పత్రికలో శిరోభాగమున ఈబీజము యొక్క చతుర్ధ మంత్రము “తస్మిన్ ప్రీతి స్తస్య ప్రియ కార్య సాధనంచ తదుపాసన మేవ- అతని ప్రేమించుట మించుట అతని ప్రియ కార్యసాధన చేయుటయు ఆయన ఉపాసన_అనునది ప్రచురింప బడెను.1857 సం|| రం వై శాఖము నుండియు 'తత్వబోధినీ పలికశిరో భాగమున సంపూర్ణ బీజమంతయు ప్రచురింప నారంభించితిమి.'

“బ్రాహ్మవా ఏకమిదమగ్రమాసీత్ నాన్య త్కించనాసీత్ తది దంసర్వమసృజత్ | త దేవనిత్యం, జ్ఞానమనంతం శివం స్వతంత్రం నిరవయవ మేక మేవాద్వితీయం సర్వవ్యాపి సర్వనియంతృ సర్వాశ్రయ సర్వవిత్ సర్వశక్తిమత్ ధృవంపూర్ణమప్రతిమం | ఏ కాస్యత స్యైవో పాసనాయా పార తిత్తిక మైహికంచశుభం భవతి | తస్మిన్ ప్రీతి స్తస్యప్రియ కార్యసాధనంచ తదుపొసన మేవ.” _ -పూర్వముకేవలము ఒక్క-పర బ్రాహ్మమాత్రముం డెను. అన్య మేమియు లేదు. అతడీ సముదయ సృష్టి గావించియుండెను. అతడు జ్ఞాన స్వరూపుడు, అనంత స్వరూపుడు, మంగళ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. నిత్యనియంత, సర్వజ్ఞుడు సర్వవ్యాపి, సర్వాశ్రయుడు, నిరవయవుడు, నిర్వికారుడు, ఏక సూతుడు, అద్వితీయుడు, సర్వశక్తి మంతుడు, పవిత్రుడు, పరిపూర్ణుడు. ఎవ్వరితో నుపమావము లేనివాడు. కేవలము అతని .ఉపాసన ద్వారా ఐహిక పొరమార్థిక మంగళము సంభవించును,

ఈబీజము ప్రకటింపబడిన పిమ్మట దానికిబ్రాహ్ములందరు