పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచిత్రము.

. కవి ఎంతమాత్రము ఇష్టముగా లేవు. ఆ రాత్రి) పండ్రెండు క్రోసులు ప్రయాణమై పోయిన పిమ్మట తెల్ల వారుజామున నాలుగు గంటలకు మాగమ్యస్థానముచేరితిమి. మాపడవ యుడ్డు చేరెను.


అప్పటి కింకను అంతయు సంఢ కారముగనే యుండెను. తీరమున కనతి దూరముననే తరులతా వేష్టితమైన యొక గృహము నుండి కొన్నిదీపముల నుండి కాంతి వెలువడుచుండెను. నేను కౌతూహల విశిష్ఠుడనై ఆయజఞాత స్థానమున, ఆయంధ కారమధ్యమున మెంటరిగా నాప్రదేశమునకు బోతిని. వెళ్ళి చూడగా నది యొక క్షుద్ర కుటీరము. దానిలో ముండితమస్తకములతో కొందరు సన్యాసులు పీతాంబరముల ధరించి కొవ్వువత్తిదీపముల పట్టుకొని ఒకమారిక్కడ ఒక మారక్కడ నుంచుచుండిరి. ఇక్కడకూడ కాశీలో నుండు 'దండీ' సన్యాసుల బోలిన వీరినిచూచి యాశ్చ్య పడితిని. ఇక్కడకు 'దండీ' లెట్లు వచ్చిరి? పిమ్మట బౌద్ధగురువులును పురోహితులు నైన ' సంగీ'లని తెలసెను. నేను వారికి కనబడకుండ బయటనుండి వారియాటను చూచుచుంటిని. ఇంతలో వారిలో ఒకరు నన్ను చూచి లోనికి తీసికొని వెళ్ళెను. నేను కూర్చుండుట కొక ఆసనమును కాళ్ళు కడుగుకొనుటకు జలమును యిచ్చిరి.నేను వారింటికి వెళ్ళుటచే వారు నాకతిధి సత్కారము గావించిరి. బౌద్ధులకు అతిధి సేన పరమధర్మము,


ప్రాతఃకాలమైనది. నేను నౌకకు మరలివచ్చి తిని. సూర్యోదయమాయెను. అప్పుడు మొదలియార్ చే నిమంత్రితులైన తక్కినవారు మమ్మును కలసికొనిరి. మొత్తము ఏబదిమంది ఉంటిమి. మొదలియారు మాకందరకు విందొనర్చెను. అతడు అనేకమైన ఏనుగులను సంపాదించి తెప్పించెను. అందొక్కొక్క దానిమీద ముగ్గురు నలుగురు కూర్చుండి ఆమహారణ్యము గుండ పోతిమి. అచ్చట మధ్యమధ్య చిన్న చిన్న కొండలు, దట్టమైన అరణ్యము. ఏనుగుల మీదతప్ప