పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియారవ ప్రకరణము.

135




ఈ మోల్మీస్ 'యొక్క ప్రశస్తమైన రస్తామీద ఒక దినముసంధ్యా సమయమున తిరుగుచుంటిని. అప్పుడు నావద్దకొకడు వచ్చుచుండెను. దగ్గరకు వచ్చిన కొలదియు ఆతడు బంగాళీయని తెలిసికొంటిని. అప్పుడక్కడ బంగాళీ యొకడుండుట చూచి విస్మయ పడితిని. సముద్రము దాటి బంగాళీ యెట్లువచ్చెను? బంగాళీలకు అగమ్యస్థానమేదియు లేదు. నీవిక్కడి కెందుకు వచ్చి తివనియతనినడిగితిని. నేనొక విషత్తులో పడి యిచటికి వచ్చితినని యతడు ప్రత్యుత్తరమిచ్చెను. ఆవిపత్తేమియో నేను వెంటనే గృహించితిని. ఎన్ని సంవత్సరముల విపత్తని అడిగితిని, ఏడు సంవత్సరములని యతడు చెప్పెను. నీవేమి చేసియుంటి వని అడిగితిని. “మరేమియు లేదు. ఒక కంపెనీ కాగితముమీద తప్పు సంతకము చేసితిని. ఉండ వలసిన గడువు గడచినది, కాని సొమ్ము లేకపోవుటచే ఇంటికి పోవుటకు వీలు పడలేదు.” అనెను. అతని ప్రయాణపు ఖర్చులు నేనివ్వవ లెననుకొంటిని గాని అత డెక్కడ యింటికి వచ్చును ? అక్కడ వాణిజ్య వృత్తిలో ప్రవేశించి వివాహమాడి సుఖముగా స్వచ్ఛందముగా నుండెను. ఆనల్లబడిన ముఖము చూపుట కింటికి పోవనేల!

అచ్చట దర్శనీయమైన గుహయొక టున్నదనియు అభిప్రాయ మున్నచో తనతో తీసికొని వెళ్ళి చూపించెదననియు మొదలియారు నాతో చెప్పెను. "నేనందుకు సమ్మతించితిని, అతడా యమవశమిశి నొక పెద్ద డింగీ తీసికొనివచ్చెను. దానిమధ్య ఒక బల్లల గదియుం డెను. ఆరాత్రి రెండవజాము వేళ 'నేను, మొదలియారు, ' స్టీమరు కెప్టన్ ' మరి వడెనమండుగురు కలసి ఆనౌకమీద బయలు దేరితిమి. రాతత్రి యంతయు పడవలో కూర్చుండి యుంటిమి. దొరలింగ్లీషు పాటలు పాడ నారంభించిరి. నన్నును బంగాళీ పాటలు పాడమనిరి. నేనప్పుడు కొన్ని బ్రహ్మగీతములు పాడితిని గాని వారిక వేమియు తెలియ లేదు. నవ్వనారంభించిరి. వారి