పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ , స్వీయచరిత్రము.



నాపపునకు వచ్చిరి. “ఇక్కడకు మీరెట్లు వచ్చిరి? ఇచటమి పనియేమి?” అని నేను వారినడిగితిని. “ఇచ్చట మావృత్తి వాణిజ్యము. ఈ ఆశ్వయుజ మాసములో మేము దుర్గ విగ్రహము ఒక దానిని తెచ్చితిమి”అని వారు చెప్పిరి. బ్రహ్మ రాజ్యము ( Burma ) లోని ఈ ఖాక్ ఫూ(Khack-Pbu) నగరమున కూడ దుర్గోత్సవము మాట విని నేనాశ్చర్యపడితిని. ఏమి! ఇక్కడకూడ దుర్గోత్సవమేనా ?

అచ్చటనుండి “ స్టీమరు'కు మరలివచ్చి 'మోల్మీన్ ' (Moulmein) వైపునకు పయనమైతిని. సముద్రము వదలి ఓడ 'మోల్మీన్' నదిలో నికి వెళ్లెను. గంగాసాగరమునుండి గంగానదిలోనికి ప్రవేశించినట్లు తోచెను. కాని యీనది కేమియు శోభ లేదు, జలము పంకిలము, నక్రమయము. ఆనదిలో నెవ్వరు స్నానము చెయ్య లేదు. 'మోల్మీన్' చేరగనే ఓడకు లంగరు వేసిరి. చెన్నపురి నివాసియగు 'నెక మొదలి యారు నన్నిచటసత్కరించెను. తానేనావద్దకువచ్చి తనవృత్తాంతము చెప్పెను. అతడు గవర్నమెంటులో ఒక గొప్పయుడ్యోగి. చాల పెద్దమనిషి, సన్నతడు తనయింటికి గొనిపోయెను. నేను “మోల్మీకా'లోనున్న కొలది కాలము నాతనియాతిథ్యము స్వీకరించితిని. ఉన్నంతకాలము నేనతి సంతోషముగా గడపితి. “మౌల్మీన్' నగర వీధులన్నియు పరిశుభములు, ప్రశస్తములు. ఇరుప్రక్కలనుగల యంగళ్ళలే నానావిధమైన పణ్య సామగ్రిని అముచుండిరి. నేను వారి వద్ద కొన్ని పెట్టెలను, కొన్ని ప్రశస్తమైన పట్టువస్త్రములను కొంటిని.నేను బజూరు వెంట నిటునటు చూచుచు నడచుచుండగా ఒక చేపల బజారు ప్రవేశించితిని. అచ్చట పెద్ద పెద్ద మేజా బల్లల మీద పరవబడి పెద్ద చేపలమ్మకమున కుండెను. ఈ పెద్ద చేపల పేరేమని యడిగితిని, మొసళ్ళని వారు చెప్పిరి. బర్మా దేశస్థులు మొసళ్ళు తిందురు. వారి నాలుక చివళ్ళ నహింస (బౌద్ధ ధర్మము), పొట్టలలో "మొసళ్ళు,