పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియారవ ప్రకరణము.

187



క్కడకుపోవుటకు అన్యోపాయములేదు. మధ్యాహ్నము మూడుగంటలకు ఆ పర్వతగుహా సముఖమున చేరితిమి. ఇచ్చట ఏనుగులుదిగి న డుమువరకు పెరిగియున్న తుప్పలలో నడచితిమి. గుహాముఖము చిన్నది. మేమందరము వంగి చేతులు భూమిమీద నానుకొని నడవవలసివ చ్చెను. రెండడుగులు ప్రాకిన పిమ్మట మేము నిలువబడుటకు వీలయ్యెను. లోపల చాలా జారుగానుండెను. "కాళ్లు జారజొచ్చెను. జాగ్రతగా నడచుచు

కొంతదూరము సాగితిమి. ఘోరాంధకారము.మథ్యాహ్నము మూడుగంటల 

వేళ రాత్రి మాడుగంటలవలె నుండెను.దారితప్పినయెడల బయటకువచ్చు టెట్లో యని భయపడుచుంటిమి.అందుచే నేనెచటికిపోయినను సందునుండివచ్చు వెలుతురు మీద మాత్రము లక్ష్య ముంచితిని. ఆయంధ కారగుహామధ్యమున 50 మంది విడివిడిగా దూరదూరముగా నిలబడితిమి. ప్రతివాని చేతిలోను గంధక చూర్ణముండెను. ఎక్కడ నిలబడిన వారక్కడనే ఆచూర్ణము రాళ్ళ సందులలో నుంచితిమి. మేమందరము సిద్ధముగా నిలబడినపిమ్మట కేప్టను తనగంధక పుగుండ నంటించెను. అటుపై మేమందరము నగ్గిపు ల్లలతో మామా గంగంధకచూర్ణముల నంటించితిమి. కావున ఆగుహ లో ఒక్క సారిగా నేబది స్థానములలో 'నేబది రంగు కాంతులు ప్రకాశం చెను. మేము గుహలోపల నంతయు బాగుగా చూడగల్గితిమి. ఏమి ప్రకాండమైనగుహ ! పైకిచూచితిమిగాని మాదృష్టి దానియుచ్ఛతర సీమ నందుకొన లేక పోయెను. గుహలో నర్ష ధారలవల్ల నేర్పడిన స్వా భావిక విచిత్ర కారుకర్మ చూచి 'మేమాశ్చర్య మొందితిమి.

పిమ్మట మేము బయటకు వచ్చి పర్వతవనమునందు వనభోజన ముచేసి (మోల్మీన్ కు తిరిగిపోతిమి. తిరిగి పోవుచుండగా మార్గమున నానాయంత మిళితమైన యొక వాద్యమువిని ఆధ్వనిని పట్టి చెంతకు పోతిమి. అచ్చట కొందరు బర్మీలు అనేక రీతుల త్రిప్పుకొనుచు నృత్యము