పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,

122



ర్మపథమఖండమునందు ఉపనిషత్తు సమాప్త మయ్యెను. ఇక ద్వితీయ ఖండమునకు అనుశాసనముల నన్వేషింప నారంభిచితిని. మహా భారతము, గీత, మనుస్మృతి మొదలగునవి చదువనారంభించితిని. వాని లోనుండి శ్లోకములను సంగ్రహించి అనుశాసనాంగము పుష్టిగావింప నారంభించితిని. ఇందు మనుస్మృతి నాకు విశేష సహాయము గావించెను. ఇందులో వివిధ స్మృతులలో శ్లోకములుండెను. ఈ అనుశాసనము లిపిబద్దము గావించుటకు నేను విస్తారము శ్రమపడితిని. ప్రథమమున దీనిని సప్తాదశాధ్యాయములుగ చేసి అందులో ఒక అధ్యాయమును వదలి వేసి దీనినిగూడ 16 అధ్యాయములుగా విభజించితిని. ప్రథమా ధ్యాయములోని ప్రధమశ్లోకములో గృహస్థు ప్రతి కార్యము నందును బ్రహ్మముతో సంయోగము కలిగియుండవలెనని ఉపదేశముండెను. “బ్రహ్మనిష్టో గృహస్థః స్వాంత త్వజ్ఞాన పరాయణః! యద్యత్కర్మపకు ర్వీతతదహణి సమర్పయేత్ .” _గృహస్థు బ్రహ్మనిష్టుడుగను తత్వజ్ఞాన పరాయణుడుగను ఉండవలెను. అతని సర్వ కార్యములు పరబ్రహ్మము నంకల్పింపుచుండవలెను. రెండవ శ్లోకములో తల్లితల్లి తండ్రుల యెడల పుత్రుల కర్తవ్యము. “మాతరంపితరం చైవ సామ్రృత్యకు దైవ తాం! మత్వాగృహీని షే. వేత సదా సర్వప్రయత్నతః! ” కుమారుడు తల్లిని తండ్రిని సాక్షాత్ ప్రత్యక్ష దైవతములుగా చూచి సర్వదా వారికి సేవ చేయుచుండవలెను.


చిట్టచివరశ్లోకములో కుటుంబములో నుండు వారొకరి యెడల నొక రేప్రకారము వ్యవహరించవలెనో ఉపదేశింపబడి యుండెను.

“బ్రాతా జ్యేష్ఠః సమఃపితాభార్యాపుత్వ స్వ కాతమః | ఛాయా స్వదాసవర్గ

శ్చ దుహితాకృషణం పరం! తస్మాదే తైరయ్యప్తః స హే తాసంజ్వరఃసదా" జ్యేష్ట బ్తాతపితృతుల్యుడు. భార్యాపుతులు స్వీయశరీరమువంటివారు. దాసవర్గము తన ఛాయా స్వరూపులు. ఇకపుత్మిక అతికృ