పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడన ప్రకరణము,

128;



పాపాత్రమైనది. కావున వీరిచే నత్యంత సంతప్తుడవు కాకుండి సర్వదా సహిష్ణుత నవలంబించుము. ఎల్లప్పుడును క్షమాగుణము కలిగి యుందుము. . “అతివాదాం తిక్షేత నావమ న్యేతకంచన: నచేమం దేహమాశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్ !”...ఇతరులదూషణవాక్యములను ఓపిక తో సహింపుము. ఎవ్వరికిని కోపముకలుగ జేయకుము. ఈ మానవ దేహముధరించి ఎవరి తోడను శతృత్వము చేయకుము.... ,


ద్వితీయ తృతీయాధ్యాయములు పతీపత్నుల పరస్పరకర్తవ్యములు, వ్యవహారవిషయములు నుపదేశించును. చతుర్ధాధ్యాయమునందు ధర్మనీతి, పంచమాధ్యాయమునందు సంతుష్టి, షష్టా ధ్యాయమునందు సత్య పాలనము, సత్య వ్యవహారము, సప్తమాధ్యాయమునందు సాక్ష్యము, అష్టమాధ్యాయమునందు సాధుభావము, ననమాధ్యాయము నందు దానము, దశమాధ్యాయము రిపుదమనము, ఏ కొదళాధ్యాయము ధర్మోపదేశము, ద్వాదశాధ్యాయము పరనింద, తయాదళాధ్యాయము ఇంద్రియ సంయమము, చతుర్ధ శాధ్యాయము పరిహారము, పంచా దశాధ్యాయము మనోవాక్కాయ సంయమము, పోడశాధ్యాయము ధర్మము యెడల శ్రద్ధనుగూర్చియు నుడువును. చివర రెండు శ్లోకములు,

“మృతం శష్టరీరముత్సృజ్య కాష్ఠలోష్ఠ సమంక్షితౌ1
విముఖాబాంద వాయాంతిధర్మస్త మనుగచ్ఛతి!
తస్మాద్ధర్మం సహాయార్ధం నిత్యం సంచియాచ్చనైః |
ధర్మేణహి సహాయేన తమ స్తరతి దుస్తరమ్ |"


' మృతశరీరము నొక కొయ్యదుంగవలె భూతలమున వదలి.మిత్రులు విముఖులై ధర్మము మాత్రము దానియనుగామిగానుండును. కావున మక్రమముగా నీ సహాయార్ధము ధర్మమును నిత్యము సంపాదించుచుండుము. జీవుడు ధర్మము యొక్క సాహాయ్యమున దుస్తర సంసారాంధ కారమునుండి ఉత్తీర్ణుడగును..... " ఏష ఆ దేశ, ఏష ఉపదేశ, ఏతదను శాసనం | ఏవము పాసితవ్య మేనముపాసితవ్యమ్ ! " " ఇ -